పుట:2015.392383.Kavi-Kokila.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38 కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము

చున్నది. ఆహా ! ప్రణయోత్కర్షము. ఈ లతాంగి నిద్రయందైనను నన్నే తలపోయుచున్నది.

హృదయేశ్వరీ, క్రూరసర్పము అమృతమయఫలంబు నంటురీతి ఈ నిర్దయుఁడు కడసారి ముద్దుగొనుచున్నాఁడు.

సీత : [మేల్కొనఁబోవును.]

రాము : జానకి మేల్కొనుచున్నది. ఇఁక నిటనుండఁదగదు. వీడిపోవఁ గాళ్ళురాకయున్నవి. ప్రేయసీ, యిదే కడసారి సందర్శనము.

[నిష్క్రమించును.]

సీత : [మేల్కొని] ఆర్యపుత్రుని కంఠస్వనమువలె నెద్దియో అవ్యక్తగంభీరధ్వని నాకు వినఁబడినట్లు తోఁచినది. [కలయంజూచి] ఇచ్చట ఎవ్వరును లేరు. కలగని మేల్కంటినిగాఁబోలు ! కను ఱెప్పలు నిద్రమాంద్యమునఁ గూరికొని పోవుచున్నవి. [మిద్రించును.]

[యవనిక జాఱును.]