పుట:2015.392383.Kavi-Kokila.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము] సీతావనవాసము 35

వరించినది. నా జీవితేశ్వరి యెక్కడ నిద్రించుచున్నది? ఆ - అదిగో ! హంసతూలికా తల్పమున -

                      కన్నుల సత్తప:ఫలము కాయము నొందెనొ! యంబుదంబులం
                      జెన్నొలికించు మించటకుఁ జేరెనొ! కల్పలతా కుడుంగ మం
                      దు న్నెఱపూలపాన్పుపయిఁ దూఁగు నిలింపలతాంగి యేమొ!కా
                      ది న్ననబోణి నాదు హృదయేశ్వరి జానకియే నిజంబుగన్ !

ఆహా? యేమి యీ యమాయిక వదనబింబమునఁ దాండవించు లావణ్యము !

                     అలకా క్రాంత లలాటసీమను గవాక్షాయాత చంద్రాంశుమా
                     లలు కర్పూరపు నిగ్గులం జిలుకఁ దల్పంబందు నిద్రించు నీ
                     లలనారత్నము సీత, యైందవ శిలా లావణ్య సారంబు ప్రో
                     జ్జ్వల కాంతాకృతి నొందెనో యనఁగ నాభావంబు రంజించెడిన్!

కరచరణాద్యవయన శోభితమగు నాహృదయ మే యిది. [ముద్దిడఁబోయి వారించుకొని] ఛీ! నే నెవ్వఁడ నీ నారీమణి నంటుటకు ?

                     రాముఁడను గానొ? నిద్రించు రామ సీత
                     గాదొ? నేనేల ముద్దిడరాదొ?

నన్ను నేనే శూన్యుఁడనుగఁ దలంచుకొనుచున్నాను. ఏమి యిది స్వప్నమా?

కంటి