పుట:2015.392383.Kavi-Kokila.pdf/311

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

అయ్య : [కప్పులో పాలు తెచ్చియిచ్చి] కలరా వచ్చిందీ మళ్ళా! ఇక ఈ స్యానిటరీ యిన్‌స్పెక్టర్లతో వేగేది కష్టం. ఇప్పుడు వొక్కపూటే తిరిపెపు కాఫీకి వస్తున్నారు. రేపటినుంచీ రెండుపూటలూ తగులుకొంటారన్నమాట!

వెంకట : [నిష్క్రమించును.]

రంగా : ఈ కాంగ్రెసు వాలంటీర్లు కొఱవిదయ్యాలండి. కలరా అంటురోగమని అది ప్రజలలో వ్యాపిస్తుందని వీళ్ళకు కొంచెంకూడా జంకులేదు. [సిగిరెట్టు ముట్టించి] అయ్యర్, మీవద్ద కర్పూరపు బిళ్ళ లుంటే ఒక పైసా కివ్వండి.

అయ్య : లేవండి. ఎందుకు?

రంగా : కర్‌చీఫ్‌లో వేసుకొని మూచ్చూస్తుంటే కలరా రాదండి. - రెడ్డిగారు, మీరుగూడ సిగరెట్ ముట్టించండి. కలరా పురుగులు ఆ పొగలో మాడిపోతవి.

కళ్యాణ : నాకు అభ్యాసం లేదు - మనంగూడా అ చత్రంతట్టు వెళ్ళుదామా?

రంగా : ఎందుకు?

కళ్యాణ : ఇది అడ్వర్ టైజ్ మెంటు ఎత్తో లేకుంటే యథార్థమో కనుక్కొందాం.

రంగా : ఆఁ! గ్రేట్ హిట్! (great hit) అవును. మనము ఈ కాంగ్రెసువాళ్ళను మెర్‌సిలెస్ (merciless) గా ఎక్స్‌పోజ్ (expose) చెయ్యాల. నేను కర్పూరం బిళ్ళలు కొనుక్కొని మీతో గూడా వస్తాను.

[అయ్యరుకు డబ్బిచ్చి వెడలిపోవును.]

కళ్యాణ : మా మహర్షిని అపనింద లాడిన వీళ్ళకు ......... ఆల్ రైట్ (allright) [వెడలిపోవును.]

________