పుట:2015.392383.Kavi-Kokila.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం : 2 పాత చత్రం వరండా.

_______

[కలరా తగిలిన స్త్రీ గుడ్డ పఱసుకొని చిన్నమూట తలక్రింద పెట్టుకొని పండుకొని బాధపడుచుండును. వెంకట రెడ్డి ఒక సంవత్సరం వయస్సుగల చంటిబిడ్డను చేతులతో పెట్టుకొని అటునిటు త్రిప్పుచు లాలించుచుండగా తెరయెత్త బడును.]

రోగి : [అటునిటు పొరలుచు, వోక్కిరమనుచు బాధపడుచు, ఈలగొంతుతో) అయ్యా, యీబాదెట్లయ్యా! నేనెందు కీ పాడు తిరనాళ్ళ కొస్తినయ్య [వోక్కిరమనుచు] రామా - దేవుడా - యెక్క డుండావురా నాయనా - అబ్బా - తండ్రీ -

[ఇంతలో బిడ్డయేడ్చును.]

వెంకటరెడ్డి : నాయన - నాయన - ఏడవబోకు తండ్రీ. పాలుతాగించేదా?

[పాల లోటాను మూతిదగ్గర పెట్టును. బిడ్డ త్రాగడు. లోటా క్రిందపెట్టి జోబీలోనుండి తాళపు గుత్తి తీసుకొని కదలించుచు బిడ్డను లాలించుచుండును.] }} రోగి : నాబిడ్డగ్గూడా కల్లర తగిలిందయ్యా?

వెంకట : లేదమ్మా, బిడ్డ బాగున్నాడు. పాలు నోటిదగ్గర బెడితే తాగలేదు.

రోగి : అట్ల తాగడు నాయనా, కాళ్ళమీద వేసుకొని ఉగ్గుపాలతో పోస్తేనేగాని తాగడు. - అబ్బా! మావాళ్ళ కెట్లా తెలుస్తుందయ్యా?