పుట:2015.392383.Kavi-Kokila.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

వెంకట : ఓ! సర్వదుంబాళంగా వచ్చింది.

రంగా : హుర్రా! (hurrahǃ) అట్లయితే కవిత్వం యింకా సుళువె.

                      కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ గాన్పించు సంసారమం
                      దాఫెన్ టైమ్సు సమస్త బాధలకులోనై గట్టుగాన్పించకే
                      కుయ్యోమొఱ్ఱయటంచు డిప్రెషను కష్టాల్ పొందు గృహసు చం
                      దానన్, ట్రాజెడి యన్న నిట్టిదెకదా సబ్లైము బావంబులన్!

వెంకట : కవిత్వం చాలా ట్య్రాజిక్ గా వుందండి.

[ఇంతలో ఒకకాంగ్రెసు వాలెంటీరు ఆతురతతో పరుగెత్తుకొనివచ్చి "వెంకటరెడ్డి వున్నారాండీ?" అని అటు నిటు చూచును.]

వెంకట : ఏమి నరసింహం?

నరసింహం: రంగనాయకుల తిరుణాళ్ళకు గ్రామాంతరాన్నుంచి యెవరో ఒక అమ్మాన్ను చంటిబిడ్డ వచ్చినారు. ఆమెకు కలరా తగిలి పాత చత్రంలో పడిపోయింది. ఆమెను వదలిపెట్టి చత్రంలో వుండిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. బిడ్డ పాలకేడుస్తుంది. తల్లి కష్టావస్థలో వుంది.

వెంకట : అట్లనా! అయ్యర్. [డబ్బిచ్చి] ఒక కప్పులో పాలు పోసివ్వండి. నరసింహం, నీవు డాక్టరు దగ్గిరికి వెళ్ళి కలరా మిక్స్చరు కలిపించుకొని చత్రందగ్గిరికి వాయువేగంతో రావాల. సైకిల్ వుందా?

నర : ఉందండి.

వెంకట : అయితే వెళ్లు.

నర : [నిష్క్రమించును]