పుట:2015.392383.Kavi-Kokila.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

మాట. You are prostituting Art. కోకిల యేమి ప్రయోజనం ఆశించి గానం చేస్తున్నదంటారు?

వెంకట : కోకిలకు ప్రయోజనం ఆశించే జ్ఞానములేదు. మనిషి కున్నది.

రంగా : We are poles as under.

"కాఫీ కప్పున నీగ....

[తర్వాత పద్యము సాగదు]

ప్రపంచమంతా (freedom freedom) ఫ్రీడం ఫ్రీడం అని ఘోషిస్తుంటే తెలుగు కవిత్వం మాత్రం సనాతనంగ మడికట్టుకోవడం, అందు వల్ల "కవిశయ: పార్థి" అన్న కాళిదాసులు మనదేశంలో పుట్టడానికి అవకాశం లేకుండాపోవడం చాలా అన్యాయం.

వెంకట : మీరు పొరబడుతున్నారు. తెలుగువారు ఎందులోనూ తీసిపోరు. డెమొక్రసీ అని పేరుపెట్టి పద్యానికి గద్యానికి వుండే భేదం లేకుండా చేశారు. కట్టుదిట్టాలేమి అవసరంలేదు. పాడిందల్లా పాటే, ఆడిందల్లా ఆటే! ఆర్టులో రిస్ట్రెయింట్ (restraint) అక్కర లేదట!

రంగా : మైగాడ్ (my God) నాలుగు సంవత్సరాలుగా కలకత్తాలో వుండడంవల్ల మన వాఙ్మయంలో కలుగుతున్న మార్పులతో నాకు టచ్ (touch) లేదు - అట్లయితే యీపద్యం యిప్పుడే పూర్తి చేస్తాను. {{center

కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ గాన్పించు సంసారమం దాఫెన్ టైమ్సు సమస్త బాధలకు లోనై గట్టుగాన్పించకే - }} [తర్వాత పద్యం సాగదు.] ఏమండీ, గణాల్లో గూడ (freedom) వచ్చిందా?