పుట:2015.392383.Kavi-Kokila.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

"కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ కాన్పించు సంసారమందాఫెన్ టైమ్సు...

[తర్వాత సాగదు; మరల ఆపాదమును ఉచ్చరించును.]

కళ్యాణ : చాలా (natural) గా వుందండి. ఎట్లా వున్నదో అట్లా చెప్పడంలోనే నేచర్ స్టడీ (nature study) వుండేది.

రంగా :

కాఫీ కప్పున నీగ తన్నుకొనుచున్ కాన్పించు సంసారమం దాఫన్‌టైమ్సు-

[తర్వాత సాగదు]

వెంకట : తర్వాత బండిసాగలేదన్నమాట!

"నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెము"

కావలసి వుంటుందేమో!

రంగా : తొందరలో ఫకార ప్రాస వేశాను. దాన్ని పూర్తిచేయడం కొంచము కష్టమె.

వెంకట : అందుకనా ఆఫైన్‌టైమ్సు అని అన్నారు.

రంగా : రాజభాష ఉపయోగించ వచ్చు. పూర్వకవి ప్రయోగాలున్నాయి. మీకు కవిత్వంగూడా తెలుసునా యేంటి?

వెంకట : ఏదో కొద్దిగ.

రంగా : అట్లయితే నాన్‌కోఆపరేటర్లయ్యా రేం?

వెంకట : ప్రస్తుతావస్థలో కవిత్వం, ఆర్టు, డ్రామా, సర్వం దాస్య విమోచనం కొఱకే వుపుయోగ పడవలెనని నా అభిప్రాయమండి.

రంగా : అయితే మీరు Art for art's sake వాదులు కారన్న