పుట:2015.392383.Kavi-Kokila.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

న్యూస్ పేపర్లలో గుప్పించి "ఇటువంటి అనాగరకులున్న దేశాన్ని రక్షించి ఉద్ధరించడానికి దేవుడు మనలను ధర్మకర్తలనుగా నియమించాడ"ని క్రిశ్చియన్ ఫిలాసఫి (christian philosphy) బోధించారట. గాంధీవల్ల మన మాతృభూమికి యింత అన్యాయం జరిగితే దాన్నంతా మరుగు పెట్టి, నోరూ వాయీ లేని అమాయికులను మోసం చస్తున్నారు ఈ నాయకులంతాను. గ్రామస్థుల్లో మొట్టమొదట మానవసేవ ప్రారంభించాల. ఆర్టు, పొయిట్రీ నేర్పించాల. వాళ్ళకు మందూమాకు యిచ్చి కాపాడాల.

అయ్య : టీ చల్లగాపోతున్నదండి.

రంగా : థ్యాంక్‌యు (thank you) [టీత్రాగబోయి టేబిలు పైబెట్టి] ఆహా! ఏమి యీ చిత్రం! [లేచును]

కళ్యాణ : ఏమిటండీ?

రంగా : ఈగ కప్పులో పడ్డది. తన్నుకొంటున్నది స్ట్రగుల్ ఫార్ ఎగ్ జిస్ స్టెన్స్ (struggle for existence) ప్రాణికోటికంతా ఎంత సహజంగావుంది! దీంట్లో ట్య్రాజిక్ బ్యూటీ (tragic beauty) కనిపిస్తుంది. ఇంతచిన్న యీగ ఇన్ని టీ నీళ్ళలో ఈదుటకు ప్రయత్నించడం సబ్లైం! సబ్లైం! (sublimeǃ sublimeǃǃ)

వెంకట : [ముసిముసి నవ్వు నవ్వును]

కళ్యాణ : [ఈగను చూచుటకు లేచును]

అయ్య : స్పూనుతో తీసిపారవెయ్యండి.

రంగా : ఆ ట్య్రాజిక్‌స్ట్రగుల్ (tragic struggle) లో వుండే స్పిరిచ్యుఅల్ (spritual) భావాన్ని చూడు! ఇటువంటి ప్రకృతి ప్రేరణలు లేకపోతే కవిత్వం రాదు.

కళ్యాణ : [కూర్చుండి] అవును! కవిత్వానికి -

రంగా : ఉండండి. నాకు కవిత్వము దొర్లుతున్నది. -