పుట:2015.392383.Kavi-Kokila.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156 కవికోకిల గ్రంథావళి [స్థలం నాలుగు

అగ్బ : అట్లేకానిమ్ము.

తాన్ : అయ్యో! మీరీ వట్టినేల యెట్లు నిద్రింతురు ?

[మూటలోని గుడ్డనుతీసి పడక వేయును.]

అగ్బ : [పడకపై కూర్చుండి] ఆహా ! యీపాంథశాల యెంత గభీర సత్యమును బోధించుచున్నది. ఉమ్రఖయ్యాము రుబాయిని తలంపునకు తెచ్చు చున్నది.

                    అంతములేని యీభువనమంత పురాతన పాంథశాల, వి
                    శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్; ధరా
                    క్రాంతులు పాదుషాలు, బహరాం జమిషీదులు వేనవేలుగాఁ
                    గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్.

ఇచట; నున్నంతవఱకె మనదనియెడి భ్రాంతి. తరువాత సుకృత దుష్కృతములు తప్ప వేఱొండు మనల నంటిరాదు. ఇట్లయ్యును జీవితాశ సహజముగ నుండుట వింతగదా ?

తాన్ : భగవంతుఁడు బ్రాంతియనెడు పుష్పహారముచే విశ్వసంసారమును బంధించి యున్నాఁడు.

అగ్బ : కావుననే బంధము గూడ ప్రియమైనది.

[పాంథాశాలలోని యాత్రికులు వెడలుచుందురు]

వెంకట : [తాన్‌సేన్ తట్టుతిరిగి] ఏమండోయ్, మీరింక సుఖంగా పండుకోవచ్చును. మేము వెళ్ళుతున్నాం.

తాన్ : అయ్యా. మీరేదేశస్థులు ?

వెంక : [స్వగతము] తస్సాదియ్యా, బాగా డాబుసరిగా చెబుతాను. [ప్రకాశముగ] నేనా ? ఆంధ్రుణ్ణి.