పుట:2015.392383.Kavi-Kokila.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం నాలుగు] కుంభరాణా 157

తాన్ : చాలాదూరము యాత్రచేసినారు.

వెంక : అయ్యో! మాదురదృష్టం యిక్కడికి గూడా తరుముకొచ్చిందండి. ఆపరమభక్తురాలిని మీరాబాయమ్మగారిని దర్శనంచేసుకోని ఆమె కృష్ణమందిరంలో పాడుతుంటె విని మా పాపిష్టి జన్మాలు కృతార్థం చేసుకోడానికి యింతదూరం ఎండనక వాననక కొండంత ఆశతో యీ పట్నంచేరినాము.

అగ్బ : [ఆతురతతో] ఏమీ ? ఆమెదర్శనము మీకు లభింపలేదా ?

వెంక : మీ ఆత్రం చూస్తే మీరుకూడా ఆభక్తురాలి దర్శనానికి వచ్చినట్లుంది.

అగ్బ : అవును.

వెంక : ఆతల్లి దర్శనమైతే యింత మనస్తాప మెందుకు ? ఆమెకు పిచ్చిపట్టిందట ! రాణాగారు ఆమెను అంత:పురములోవుంచి చికిత్స చేయిస్తున్నాడట.

తాన్ : తన యవివేకమునకు చికిత్సచేయించుకొనిన బాగుగ నుండెడిది.

వెంక : పిచ్చికుదిరి కృష్ణమందిరానికి వస్తుందని పది దినాలు కనిపెట్టుకొని వుండినాము. ఆమెకు దినదినం పిచ్చి హెచ్చుతున్నదని విని ఇక యింతదూరము వచ్చినవాళ్ళము బృందావనమైనా సేవించుకొని పోదామని బయలుదేర్నాము. మీరేమైనా వస్తారా ?

అగ్బ : [ఆలోచనా నిమగ్నుఁడై యుండును.]

తాన్ : మేమిప్పుడే యిచ్చటకు వచ్చితిమి. పట్టణముచూడ వలయును.

గోకు : అబ్బబ్బా, యీ వెంకటదాసుతో వేగేది కష్టంగావుంది. ఎవరడిగినా ఆంధ్రుణ్ణి ఆంధ్రుణ్ణి అని బలే డాబుసరిగా మాట చెబుతాడు. కార్యంమాత్రం బండిసున్న. దారిలోమనిషి కనపడ్డ పాపానికి తలవిసిగి బట్ట