పుట:2015.392383.Kavi-Kokila.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114 కవికోకిల గ్రంథావళి [అష్టమాంకము

ప్రజలు : మునీంద్రా, సీతాదేవి మాకుఁ గన్నతల్లివంటిది. జానకీదేవి పావనచరిత్ర - పతివ్రతామణి. దేవీబహిష్కారము ప్రమాదజనితము; ప్రమాదజనితము.

రాము : [స్వగతము] ఈప్రజ లే గాలికి ఆ చాపయెత్తు స్వభావము గలవారు.

వాల్మీ : సభ్యులారా, సీతాదేవి దైవవశమున బ్రతికియుండినఁ బునర్గ్రహణ యోగ్యమగునా ?

ప్రజలు : నిస్సంశయముగ - ఈయశ్వమేధమున మహారాజునకు సీతాదేవియే సహధర్మచారిణి గావలయు.

రాము : ఇది యెట్లు సంభవించును ?

వాల్మీ : వత్సా ! ధైవఘటన కసాధ్యముగలదా ?

రాము : [ఆతురతో] ఆర్యా, అట్లయిన మాహృదయేశ్వరి బ్రతికి యున్నదా ?

వాల్మీ : కుమారా, జానకి బ్రతికియున్నది.

[ప్రజలలో సంతోషసూచకసంభాషణలు, గుజగుజలు]

రాము : ఏమి వినుచున్నాను ? ఇది స్వప్నము గాదు గదా ?

ప్రజలు : మహారాజా, మామనములు చల్లఁబడునటుల సీతాదేవిని పరిగ్రహించి సుఖింపుము.

వాల్మీ : రాఘవా, నీకుఁ గుమారులుగూడఁ గలరు.

లక్ష్మ : [స్వగతము] నాయూహ యథార్థమై యుండునా ?

రాము : ఆహా ! యిదియేమో మాయనాటకముగ నున్నది. మునీంద్రా, యిదియంతయు నసంబద్ధము. నాకెక్కడిజానకి ? యెక్కడి కొమరులు ? సీతకును నాకును బండ్రెండు వత్సరములు దుర్భేద్యకుడ్యమువలె యెడఁబాటు గావించినవి. ఇది యంతయు స్వప్నము - మృగతృష్ణాప్రాయ