పుట:2015.392383.Kavi-Kokila.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాంకము] సీతావనవాసము 115

ము - ఇంద్రజాలము - ఈమందభాగ్యునికి భార్యలేదు, బిడ్డలులేరు, సోదరులులేరు, బంధువులులేరు. ఎవ్వరునులేరు. రామునకు లోకమంతయు శూన్యము ; అంధకార మలీమసము; నరక సదృశము.

వాల్మీ : అమ్మా, జానకీ.

[జానకి, తాపసపురంధ్రి, ప్రవేశింతురు; కుశలవులు ఆమెనుచూచి ప్రక్కకు వత్తురు]

రాము : [ఆశ్వర్య దు:ఖములతో] జానకియా ? - ఏకవేణీధారిణి - కృశాంగి - ఆ - నాజానకి బ్రతికియున్నది !

[రాముఁడు పీఠముపైనుండి లేచును. కుశలవులు ఆశ్చర్యముతో చూచుచుందురు. రాముఁడు సీతను దగ్గఱకు తీసికొని] ప్రాణప్రియా, నా స్వార్థపరత్వమును క్షమియింపుము. నాయపరాధమును నీకృపాకటాక్ష వీక్షణములఁ గప్పిపుచ్చుము. నాజివితశేషమును నీ యభీష్టపాలనమునకై వినియోగించి యపరాధ విముక్తుఁడ నయ్యెదను.

నాముద్దు బిడ్డలారా, కుశలవులారా, రండు నాయుత్సంగము నలంకరింపుఁడు. నన్నానందవార్ధి నోలలాడింపుఁడు. మీతల్లి నట్లు నట్టడవులఁ గష్ట పెట్టితినని కోపింపకుఁడు.

కుశు : [స్వగతము] ఇదియేమి, మహారాజి ట్లనుచున్నాఁడు ?

లవు : [స్వగతము] మేము రామాయణకథానాయకుని బిడ్డలమా ?

[సభలో గుజగుజలు]

రాము : నాయనలారా, రండు. నన్నుఁ గౌగిలించుకొనుఁడు.

లవు : [స్వగతము] ఇంతవఱకుఁ దాపసబాలకుల మనుకొను చుంటిమి !