పుట:2015.392383.Kavi-Kokila.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 కవికోకిల గ్రంథావళి [అష్టమాంకము

చుచు జనసమ్మర్దములగు ప్రదేశముల ఏమేమొ యపవాదములు వ్యాపింపజేసితిని. రామభద్రా, రక్షింపుము. రక్షింపుము.

ప్రజలు : జానకీదేవి నిష్కలంక - సీతాదేవి సాధుచరిత్ర -

రాము : [స్వగతము] ఓసీ క్రూర రాక్షసీ, నీపగతీర్చుకొంటివా ?

విభీ : మహారాజా, ఈకపటచారిణిని దెగటార్చుటకు ఆజ్ఞవెట్టుము.

శత్రు : అన్నా, ఈ రాక్షసి కరుణార్హ గాదు.

                     నిండుచూలాలి వైదేహి నిష్ఠురంపుఁ
                     గష్టములకుఁ గారణమైన దుష్టురాలిఁ
                     గఱకు కఱవాలమునఁ జీల్చి కండలెల్లఁ
                     గాకులకు గ్రద్దలకు వైవఁ గౌతుకంబు.

రాము : తమ్ముఁడా, దీక్షాకంకణపూతమైన నాహస్తము అపరాధిని రక్తమందైన ముంపఁజాలను. ఈ కుటిలచరిత్రను హింసించినను నాప్రాణవల్లభ మరల బ్రతికివచ్చునా ? శూర్పణఖా, వెడలిపొమ్ము. పాప పరిహారము గావించుకొనుము.

శూర్ప : రఘుకులేశ్వరా, నీయనంత కారుణ్యము వర్ధిల్లుగాక ! దారపుత్రవంతుఁడవై సుఖింపుము.

రాము : [స్వగతము] జానకి జీవించియున్నఁగదా -

ఋషులు : రామభద్రా, నీయతిలోక దయాళుత్వము ప్రశంసనీయము.

విభీ : శూర్పణఖా, రామచంద్రుని యాజ్ఞలేమి నీవు వధింపఁబడక బ్రతికితివి. ఇఁక లంకయం దడుగిడిన నా కరవాలము నీప్రాణముల నూటి కొనును. పొమ్ము. నీపాపాత్మ తరియించునటుల నెక్కడనైన వనమందుఁ దప మాచరింపుము.

శూర్ప : [స్వగతము] పులివాఁతబడిన జింకపిల్ల జాఱి పడినటుల ఈ