పుట:2015.392383.Kavi-Kokila.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాంకము] సీతావనవాసము 111

[సభలో గుజగుజలు]

శూర్ప : దీనరక్షామణీ, ఆపద్భాంధవా, రామచంద్రా యాఁడుకుయు లాలింపుము. అనాధవత్సలా, ఈపాపాత్మను రక్షింపుము. నాతప్పు క్షమియింపుము. నన్ను బ్రతుకనిమ్ము.

భరతు : [స్వగతము] ఈరహస్యము పూర్వమే తెలిసియుండిన జానకీదేవి యడవులకుఁ బంపఁబడి యుండదుగదా.

విభీ : ఓసీ మాయలమారీ, నీబొంకు లింకఁ జాలింపుము. సీతాప వాదకళంకము నీహృదయ రక్తపూరమున గడిగివేయవలయును.

శత్రు : [స్వగతము] శూర్పణఖ కుట్రయా యింతటికిం గారణము !

శూర్ప : దీనబాంధవా, రామభద్రా, యీ దీనురాలికి నభయ ప్రదాన మొసంగి రక్షింపుము.

                     ప్రాణవల్లభఁ జీకాకు పఱచినట్టి
                     కాకదైత్యుని సైతముఁ గాచినావు;
                     అఖిలలోక శరణ్యుండ వైన నిన్నుఁ
                     బ్రాణదానంబు వేఁడెద రామభద్ర.

లక్ష్మ : అన్నా, యీమాయావినియందు నెనరూనఁదగదు.

రాము : దానవీ, నీవెట్లు సీతాపవాదమునకు మూలమవైతివి ?

శూర్ప : మహారాజా, యథార్థము చెప్పుచున్నాను. నన్ను రక్షించినను శిక్షించినను మీ కరుణయె.

రాము : చెప్పుము.

శూర్ప : రాక్షసవినాశన ప్రతీకారమొనరింపఁ గోరి జానకీదేవిని నెట్లైన నడవులఁ గష్టపెట్టనెంచి అయోధ్యఁ జేరితిని. మాఱువేసంబునఁ జరిం