పుట:2015.392383.Kavi-Kokila.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 99

లక్ష్మ : అంతరమెఱుంగక బాల్యచాపలమున మార్కొనిన యీ బాలునిగతి యేమైనదో చూడుము.

లవు : [శింజనీ టంకారము సేయుచు] ఇఁక నీగతి యేమి కానున్నదో తెలిసికొనుము.

కుశు : [మెల్లగఁ గనువి చచి] తమ్ముఁడా, నాకుఁ దోడ్పడవైతివా ? మరణశయ్యయందైన నొక్కమాఱు కౌఁగిలించుకొని నన్ను వీరస్వర్గమునకు వీడ్కొల్పవా ?

లవు : [విల్లుక్రిందవైచి] ఆహా ! మాభాగ్యవశమున అన్న బ్రతికి యున్నాఁడు. [దగ్గరకుఁబోయి మోకాలిపై వంగి] అన్నా, నిన్ను దురాత్ములునొప్పించిరా ? నన్నేల ముందుగఁ బంపివైచితివి ?

కుశు : తమ్ముఁడా, నేనిపుడెక్కడ నున్నాను ?

లవు : రణరంగమున.

కుశు : ఇంకను రాజకుమారుఁడు బ్రతికియున్నాఁడా !

లవు : వీఁడుగో! యజ్ఞపశువువలె బంధనమునకు సిద్ధముగ నున్నాఁడు.

కుశు : [చేతిపై సగములేచి] ఏఁడీ ?

లక్ష్మ : [స్వగతము] ఔరా ! ఏమి యీ కుమారుని క్షాత్రము ?

                    శరఘాతంబుల వేదనన్ సొలయుచున్ శార్దూలపోతంబు నె
                    త్తెరులొల్కంగ సగంబునిక్కి మృగయుం దుండాడ నుంకించెనా
                    శరవిద్ధాంగుఁడు బాలకుం డురు రుషా సంక్షుబ్ధ చిత్తంబునం
                    బరఁగున్; బాపురె ! వీరమోహన రణప్రావీణ్యరూపంబనన్.

కుశు : లవా, నావింటి నిటు లందియిమ్ము. [లవుఁడు అందియిచ్చును] [స్వగతము] ఔరా ! నాకరము శరాసన భారమునైన నోర్వకున్నది. [వింటిని