పుట:2015.392383.Kavi-Kokila.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

చికిత్సగావించి, యన్నకు ఉపాయనముగ అయోధ్యకుఁ బంపెదను.

[కుశునినెత్తి భుజముపై వైచికొనును.]

[లవుఁడు ప్రవేశించును.]

లవు : [స్వగతము] ఓహో ! యీ రాజకుమారుఁడు అన్న నెత్తుకొని వెడలుచున్నాఁడు. [ప్రకాశము] ఓయీ, నిలుము, నిలుము, నీ దొంగతనము సాఁగుననుకొంటివా ?

                      నేను మాయన్న వెంబడి లేనియపుడు
                      లెక్కయిడరాని సైనికు లొక్క మొగిని
                      పుట్టతేనెకు నీఁగలు మూఁగినటుల
                      ముట్టడించి వధించియుఁ బోవువారె?

లక్ష్మ : [కుశుని నేలపైఁ బరుండఁబెట్టి స్వగతము] ఔరా ! యీ బాలకు డెవ్వఁడు ? ఈమూర్ఛితుని ప్రబింబమో యనునట్లున్నాఁడు! వీరిరువురు కవలైయుందురా ?

లవు : ఓయీ, శూరమ్మన్యుఁడా, మీరాచవారి శూరత్వ మిట్టిదియేనా ? ఒక్క బాలకుని అందఱు సైనికులుపొదివి తెగటార్చుటయేగాక అతని మృతకళేబరము సైతము దొంగిలించుకొని పోవుచున్నావా ?

ఓయీ, ఆకళేరబరమును విజయోపాయనముగఁ దలంచుము. అన్యోన్య జిగీషువులమగు మనలో నెవరు గెలచినను ఆ పారితోషకమును గైకొందము.

లక్ష్మ : బాలకా, నీవీ ఋషికుమారునకు సోదరుఁడవా ?

లవు : నీకు నకాలమృత్యువును.