పుట:2015.392383.Kavi-Kokila.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

దిగవిడచును]

లవు : [శింజినీ టంకారము సేయును.]

[వాల్మీకి ప్రవేశించును]

వాల్మీ : ఆహా ! శాంతికిఁ దావలమైన తపోవన మేలొకో ఆర్ద్రశోణితపిశితంబులఁ గళంకితమైనది.

లవు : రాజకుమారా, నీప్రాణములఁ గాచికొమ్ము.

                     మాజనని సర్వలోకసమ్మాన్యవృత్త
                     పూతచారిత్ర వీరప్రసూతయేని
                     తాత వాల్మీకి సత్తపో ధన్యుఁడేని

వాల్మీ : ఎవరు నన్నుఁ బేర్కొనుచున్నారు ?

లవు : అస్త్రమియ్యదె,

వాల్మీకి : ఆహా ! ప్రమాదము. విడువక యాఁగుమాఁగు.

లక్ష్మ : మునిచంద్రమా, లక్ష్మణుఁడు మ్రొక్కుచున్నాఁడు.

వాల్మీ : కుమారా, వర్ధిల్లుము !

కుశు : [స్వగతము] లక్ష్మణుఁడా యీతఁడు ?

లవు : తాతా, [వాల్మీకిని కౌఁగిలించుకొని] యీ దురాత్ముని సేనలు అన్నను ముట్టడించి మూర్ఛిల్లఁజేసినవి. అన్నను బ్రతికింపుము.

కుశు : తాతా, నన్ను శీఘ్రముగ వీరస్వర్గమునకు వీడ్కొల్పుము. ఈ శరాఘాత వేదన దుర్భరమగుచున్నది.

వాల్మీ : [స్వగతము] ఆహా ! దైవఘటనాచిత్రము ! [ప్రకాశముగ] నాయనా, యూరడిల్లుము. నీవు వజ్యకాయుఁడవు కాఁగలవు.