పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రవి కొక్కటి కృపీటభవున కొకండు ధా- | తకు రెండు నాల్గు మాధవునకుఁ బది


గీ.

యర్థి నినుఁ జెప్పు నీ మహత్వము గణింప | దుర్లభంబని జనులకుఁ దోఁచుఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

103


సీ.

కరిముఖ నరముఖ కపిముఖాహిముఖోష్ట్ర- | ముఖ సింహముఖ మేషముఖ వరాహ-
కర్ణ ఘంటాకర్ణ గజకర్ణ శంఖక- | ర్ణ ద్వికర్ణ త్రికర్ణ ప్రచండ
కుండోదర నికుంభ కుంభోదర ప్రకంప- | న మహాకాళ కపర్ది వజ్ర
పాణి సుదర్శనపాణి శూలాయుధ | సూర్యపాతన నంది సోమనంది


గీ.

నందిషేణాది గణము లానందమున భ- | జింప వెలుఁగొందు నిన్ను భజింపుచుందు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

104


సీ.

శ్రీనీలగిరిని భుజించుటయును మంగ- | లాద్రిపై నిల్చి దాహంబుఁ గొనుట
సింహభూధరమున సిరిగంద మలఁదుట | వేంకటాచలమున విలువ లేని
మానికమును సొమ్ములూనుట ద్వారకా- | పూర్వరమందు నపూర్వలీల
స్త్రీలతో నిధువనక్రీడలు సల్పుట | శ్రీరంగమందు నిద్రించుటయును