పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నిన్ని సౌఖ్యము లొందుట వెన్నుఁ డిలను | గన్ను నీకర్పణము సేయు కతనఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

105


సీ.

మురహరుం డవతారములు దశవిధములఁ | బరిపాటిగా భూతభావియుగము-
లం దుద్భవించుచు నంతంబు నొందుచుఁ | బడరానిపాట్లెల్లఁ బడి బడసెను
బెనుమసనంబులోఁ బెద్దనిద్దురఁ జెందు | పంచజనుం డొకపరి సమస్త
నాకవాసులు మెచ్చ నేకాదశాకార- | ముల కిరవగు రూపమును ధరించు-


గీ.

నౌర ప్రత్యక్షకైలాస మనఁగఁ బరగు | క్షితిని సమ మెందుఁగలదె నీ క్షేత్రమునకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

106


సీ.

ఆవిర్భవించునే యాఁకలి దప్పి నీ | కటకంబునందు లింగములు గన్న
శ్రమఁ జెందునే సదాజ్ఞానవాప్యాద్యమ- | హాదీర్ఘికలు ముదమారఁ గన్న
బడలికఁ గలుఁగునే కడకఁ బంచక్రోశ- | గమనాభిలాషంబు గడలుకొనినఁ
గొందలమొందునే కుక్కుటస్థానాది | మంటపతతిఁ గడగంటఁ గన్న


గీ.

మాటిమాటికి నేను నీ వీటితోడ | సాటిగల ప్రోళ్లు లేవంచుఁ జాటుచుందు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

107