పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

సౌగంధికాంభోజరాగప్రవాళ ప- | ల్లవసముజ్జ్వలకాంతి లాలితములు
ఝషహలధ్వజశంఖచక్రాబ్జపవిధను- | రాది నవీనరేఖాన్వితములు
ఘటజవసిష్ఠముఖ్యమునీంద్రహృత్పద- | కర్ణికాపీఠికాగ్రస్థితములు
భాషాసుయోషావిశేషసీమంతసిం- | దూరబిందూరు సిందూరితములు


గీ.

నగు భవత్పాదములు చూపఁదగదె నాదు | చిత్తమిత్తఱిఁ దమి నిగురొత్తె సామి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

51


సీ.

అసమానబాహువీర్యవిజృంభణాదిత్య- | తనయోగ్రదంత తాడనకరములు
వాణీశముఖమౌళిమాణిక్యదీపికా- | ప్రాజ్యనీరాజన భాజనములు
స్తబ్ధరోమర్ష భోద్యద్వర్షధార్యబ్ధి- | వరజావరాదృష్ట వైభవములు
ప్రత్యగ్రశీతలభానుసంకాశ న- | ఖశ్రేణికావిభా విశ్రుతములు


గీ.

నగు త్వదంఘ్రిపయోజము లస్మదీయ | మానససరోవరంబునఁ బూని కొలుతు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

52


సీ.

ఉపనయనుండవై యొప్పవే ధరఁ బంచ- | యజ్ఞపరుండని ప్రాజ్ఞులనఁగ