పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజశిఖామణివై జేయవే దుష్ట- | శిక్షణంబును శిష్టరక్షణంబు
యార్యుఁడవై యనయముఁ బాశుపాల్యప్ర- | భావమందవె పశుపత్యభిఖ్య
వృషలుండవై సదా విఖ్యాతిఁ గాంచవే | త్రివిధవర్ణాసక్తి తేజరిల్ల


గీ.

బ్రాహ్మణక్షత్రియోరుభూపాదభవుల | లోన నెవ్వండవొ గొల్తు నానతిమ్ము,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

53


సీ.

బ్రహ్మచర్యము గదా పావన- | గౌరీతపోవనంబునకును బోవుటఁ గన
గార్హస్త్యమే గదా కరము శర్వాణితో | తిరముగాఁ గూడి కాపురము సేత
మిగుల వానప్రస్థమే కదా జడలు ధ- | రించి యెల్లపుడు చరించుటెల్ల
యత్యాశ్రమము కదా నిత్యంబు భిక్షాన్న- | మారగించుట వర్ణి సాంబ జటిల-


గీ.

భిక్షుకాఖ్యలు సహజముల్ త్ర్యక్ష నీకు | నిదియది యటంచు మది నిశ్చయింపనేర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

54


సీ.

అంబికాధర నవ్యబింబికాఫలరస- | గ్రసనవ్యసనకీర గర్వదూర
కాళీమనఃఫుల్ల నాళీకమకరంద- | పానషట్పదరాజ భవ్యతేజ