పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పక్వరసాలాంఘ్రిపము మాని చనునె శు- | కంబు దుత్తూరసాలంబునకును
లలితపయఃపానలాలస మానసౌ- | కసము పయఃపానకాంక్ష యిడునె
కలిత బలాహకావలిఁ గాంచి ముదమొందు | కేకి కావలిఁ గాంచి కేరుటెట్లు


గీ.

నీ పదధ్యాననిరతుఁడై నెగడు జనుఁడు | చేరి పెరవేలుపుల నుతిసేయఁ జనునె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

42


సీ.

బూతి నెన్నొసటపైఁ బూసెదనంటినా | కీలికీలలు సోకి కాలునేమొ
యడుఁగులొత్తెద బత్తినంటినా నూపురా- | శీవిషభూత్కృతుల్ జెందునేమొ
నందిని ముస్తాబొనర్చెదనంటినా | క్రొవ్వాడికొమ్ములఁ గ్రుమ్మునేమొ
బంటునై కొలిచెదనంటినా ప్రేతర- | వంబులకును మేను వడఁకునేమొ


గీ.

యుగ్రమూర్తివి దయఁ జూడకున్నఁ జేరఁ- | దీసి బ్రోవదె యార్య దయాసమగ్ర,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

43


సీ.

ఏ నవీనాశ్వంబుపై నధిష్ఠించెనే | విఘ్నరాజు దలంప వృషము గాక
దిట్టముగా నేమైనఁ బటములు గట్టెనే | వటుఁడు దిగంబరత్వంబు గాక