పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కామాంధకారివి గావున వర్ణివై | మేనకాత్మజను భ్రమించుటెల్ల
మంజులద్విజరాజమౌళివి గావున | విప్రవరాఢ్యత వెలయుటెల్ల
ప్రచురమహాశ్మశానచరుండ వటుగాన | నొగిఁ బిశాచస్నేహమొందుటెల్ల
సుమహానటాభిధానమునొందితివి గాన | మూఁడువేళలయందు నాఁడుటెల్ల


గీ.

నెంతవారికి నైనను వింత గాదె | సంతతంబు భవత్ప్రౌఢి చింతసేయ,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

40


సీ.

వేమారు శ్రీమహావిష్ణువల్లభ యంచుఁ | బలుమరు బ్రహ్మాది పతియటంచు
గొనకొని స శివ ఏకో దేవ యంచును | దివిరి రుద్రో న ద్వితీయ యనుచు
రహి సమానాధికరహిత యటంచు మా- | నక శివాత్పరతరం నాస్తి యనుచు
మాటిమాటికి జనుర్మరణదూర యటంచు | దైవతమూలకందం బటంచు


గీ.

నిగమములు బల్కఁగ నరుఁడు నియతి నన్య- | దేవతారాధన మొనర్పఁబోవఁ దగునె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

41


సీ.

వికసితమందారవిటపి మాని మిళింద- | మఱుఁగునె వేగ మందారమునకు