పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాంతమేమైనను సంగ్రహించెనే వీర- | భద్రుఁ డక్షుద్రకోపంబు గాక
నే తల్లి గని పెంచెనే తారకారిని | భావింప సంశయాస్పదము గాక


గీ.

తండ్రి పోలిక సుతులకుఁ దగె నొకొక్క | గుణము మేలయ్యె నయయొ నాల్గుఁ దగె నీకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

44


సీ.

అఘటనాఘటనాసమర్థుఁడ వంటకు | శునకాకృతులు బూను శ్రుతులు సాక్షి
కంజజుకృతము లంఘ్యం బటంటకును మా- | ర్కండేయమౌనివర్యుండు సాక్షి
సబలు దుర్బలుఁ జేయు జాణ వంటకుఁ ద్వన్న- | గోత్పాటనుఁడు దశాస్యుండు సాక్షి
కూటస్థుఁడ వటంటకును ద్వదీయేక్షణ- | సంజాతుఁడైన శ్రీజాని సాక్షి,


గీ.

సాక్షి గోధినితాంతమేచక శిరోధి | హతవిరోధి యపారదయాపయోధి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

45


సీ.

గోహయ నీ లెంక వాహనంబులు గదా | దేవతురంగ మైరావతములు
సత్పాఠకులు గదా సంగీతసాహిత్య- | చణులు నారదుఁడును శారదయును
మండనంబులు గదా మహితచక్షుశ్శ్రవ- | స్సార్వభౌముడును జందురుండు