పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘనపురాణంబులు వినెనే కి- | రాతుండు పిశితఖండంబు లర్పించుటకును


గీ.

యేమివిద్య లు త్వత్టాక్షేక్షణములఁ | జూచినఁ గృతార్థులగుదురు నీచులైన,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

35


సీ.

అభిషేకయోగ్యంబులగు నారికేళంబు- | లను లేపయోగ్య చందనము లక్ష-
తానీకయోగ్య వంశానోకహములు స- | మర్చనాయోగ్య కుందాదికములు
గురుధూపయోగ్య గుగ్గులములు జ్వలదీప- | యోగ్య శారదపాదపోచ్చయములు
నైవేద్యయోగ్య కనచ్చూతములు వీటి- | కాయోగ్య ఫణివల్లికాక్రముకము-


గీ.

లగములయ్యు నెంతేని ధన్యత వహించె | యుష్మదష్టవిధార్చనాయోగ్య ఫణితి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

36


సీ.

శైలూషదళ మొక్క టేలాగు నర్పింతు | మారేడువనములో మలయు నీకు
నొక్క క్రొవ్విరిచేత నొగినెట్లుఁ బూజింతు | తారకాకుసుమముల్ దాల్చు నీకు
నేకఫలం బెట్టులిడుదుఁ బ్రేమ మనేక- | పారిషదిష్టార్థఫలద నీకు
చుళుకోదకమున నెట్టుల స్నానమమరింతుఁ | దలపైని మిన్నేరుఁ గలుగు నీకు