పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నైన సద్భక్తితోడుత నే నొసంగు | పత్రపుష్పఫలాంబు సపర్యలు గొను,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

37


సీ.

నీచుఁడు వీఁడని నెమ్మదినుంచక | భ్రమరకీటన్యాయ పటిమ నెఱపు
నే పల్కు పలుకు లెంతే పద్యములు జేయు | నవ్యఘుణాక్షరన్యాయశక్తి
వడి విడనాడంగ వలదు మర్కటకిశో- | రన్యాయపద్ధతి రాజిలంగ
చేపట్టఁగదవయ్య చెలఁగి మాల్జారకి- | శోరమహాన్యాయ కారణముగ


గీ.

గాదు మామక యత్న మొకానొకతఱి | కాకతాళఫలన్యాయ ఘటనఁ గాదె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

38


సీ.

బహుపాతకుఁడనంచు భయము నొందఁగనేల | పతితపావన ఘనవ్రతము నీది
షడ్వర్గశాత్రవచ్ఛటకు జంకఁగనేల | శరణాగతత్రాణ బిరుదు నీది
నిప్పచ్చరంబుఁ జెందిన చింత యేటికి | దీనదయాపరదీక్ష నీది
సుగతి గల్గ గణించు దిగులుల్లముననేల | శ్రేయోప్రదానోరుచిహ్న నీది


గీ.

యే ప్రకారంబునఁ గనఁగ నేది శంక | నిను నొకించుక సేవించు జనులకింక,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

39