పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యుష్మదీయస్కంధయుతమయ్యె నేనిఁక- | కళవసం బే నిష్ఠగతిఁ జరించె
నీ గ్రీవమాలికలై గ్రాలె రుద్రాక్ష- | ఫలము లే పూజలు సలిపెనొక్కొ


గీ.

బిల్వ మే వ్రతమున నీకుఁ బ్రీతియయ్యె | నవనిఁ బున్నియ మొకరి సొమ్మౌనె తలఁప,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

33


సీ.

కరికాళుఁడొసగు మాకందఫలంబులు | మిక్కుటంబగు కూర్మి మెక్కిమెక్కి
మాదర చెన్నాఖ్యుఁ డాదరంబున చెట్టు | సురుచిరాంబకళంబుఁ జుఱ్ఱిజుఱ్ఱి
నిమ్మవ్వ మదిఁ బత్తి నివ్వటిల్లఁగఁ బోయు | జావ సంతసముసఁ దావితావి
బోయకన్నడు యెడఁబాయక నర్పించు | నంజుఁడు తునకలు నమలినమలి


గీ.

తృప్తిఁ దీరక భిక్షాం ప్రదేహి యనుట | జనులు దీర్తురె క్షుత్తు విశ్వంభరునకు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

34


సీ.

వేదముల్చదివెనే వేదండము స్వతుండ- | మున వారిఁ దెచ్చి మజ్జన మొనర్ప
శాస్త్రముల్చదివెనే చక్రిస్ఫుటస్ఫటం- | బాతపవారణ రీతిఁ బట్ట
మంత్రముల్ నుడివెనే మహి నూర్ణనాభి శో- | భిల దుకూలవ్యూతి కలన నెఱప