పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గేరి కేదారసుక్షేత్రేశుఁ గన్నఁ గే- | దారసుక్షేత్రచింతనమదేల


గీ.

శ్రీగిరీశు నిరీక్షింపఁ జెందదే య- | శేషసంపత్తి హృతవిపశ్చిద్విపత్తి,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

24


సీ.

భవవార్ధినిర్మగ్నభక్తులఁ దరిఁ జేర్చఁ | దారకేశ్వరుఁడవై తనరినావు
నతజనప్రతతిసంసృతి రోగములు మాన్ప | వైద్యనాథుండవై వరలినావు
సర్వదాసాజవంజవ సంజ్వర మణంప | సోమేశ్వరఖ్యాతిఁ జూపినావు
సేవక భవబంధ లాపనం బొనరింప | బట్టిసాధిపుఁడవై పఱఁగినావు


గీ.

యిహపరము లబ్బవే భువినించుకేని | బ్రతిదినము నిన్ను స్మరియింపఁ బరమపురుష,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

25


సీ.

వ్యాఘ్రేశ్వరాభిధేయము వహించితి మాను- | షాఘౌఘరురు పలాయనము సేయ
హరిమాయూరేశ్వరాభిఖ్యఁ బూనితి | నరవిపదహి ఖండనంబు సేయ
నాగేశ్వరాభోగ నామంబు నొందితి | జనశోకపవన భక్షణము సేయ
నేకామ్రనాయకాఖ్యాక నిల్చితి మర్త్య- | కామితఫలములు గలుఁగఁ జేయ