పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీ కడియంబైన కాకోదరవరుండు | మహితభూభరణసమర్థుఁడయ్యె
నీ వధూతిలకంబు నిర్జరుల్ నుతి సేయ | జగదంబ నామబ్రశస్తి నొందె-


గీ.

నభవ నీవు జగజ్జనకాఖ్యఁ బూని- | తౌర నినుఁ గొల్చువారి భాగ్యము కొఱఁతయె,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

22


సీ.

శివ యన్న మాత్రనే చేకూరు నైహికా- | ముష్మికములు భక్తముఖ్యులకును
త్ర్యంబక యన్న నయంబుగ మూఁడుజ- | గంబుల నేలు యోగంబుఁ గలుగు
మృత్యుంజయ యటన్న సత్యంబు ధర్మార్థ- | కామమోక్షములు శీఘ్రమె లభించు
బంచాక్షరములు జపించినఁ బృథుపంచ- | పాతకంబులు బటాపంచలగును


గీ.

తొలఁగు ద్విపద త్రినేత్ర చతుర్భుజములు | నైదుమొగములు గలుఁగు మహాత్మ వింత,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

23


సీ.

వారణాశీశ తావకదర్శనం బబ్బ | వారణాదులమీఁది వాంఛయేల
పుండరీకేశ్వరుఁ బొడగన్నఁ బుండరీ- | కాదులమీఁది ప్రియంబదేల
కుంభకోణేశుఁ గన్గొన్న నూతనశాత- | కుంభకుంభాదులు గోరనేల