పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మృగఖగాహిద్రుమాఖ్యల నెగడితౌర | వాటి భాగ్యంబుఁ బొగడ నెవ్వరి తరంబు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

26


సీ.

నీవు న్యగ్రోధావనీజమై యుండంగ | శౌరి తద్వటపత్రశాయియయ్యె
నీ కంకణమున సంధిలు మసారంబనఁ | దోయజాక్షుఁడు శేషశాయియయ్యె
నీ విషంగమునకు నిశితాంబకంబయ్యుఁ | జక్రపాణి పయోధిశాయియయ్యె
సదమల జంబుకేశ్వరుఁడవై యున్న త్వ- | త్సన్నిధి హరి రంగశాయియయ్యె


గీ.

నీ రహస్యంబు లెఱుఁగరొకో రమేశ్వ- | రేశ్వరుల నెడఁగావింతు రిలఁ గుజనులు,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

27


సీ.

తన్నవే విధునిఁ బదాఱు వ్రక్కలు గాఁగ | దయఁ గ్రమ్మఱఁగ మూర్ధ్నిఁ దాల్చినావు
తలఁ ద్రుంపవే విధాతకుఁ బునస్సారథ్య- | కృత్యంబునకు నియోగించినావు
ఫాలాగ్నిచేఁ గాల్పవే లతాంతాయుధు | మించి వెండియుఁ బ్రతికించినావు
తఱగవే దక్షు మస్తకము నెప్పటి మేష- | శిరమిచ్చి జీవితుఁ జేసినావు


గీ.

నిగ్రహానుగ్రహంబులు నీకె తగును | రుద్ర కారుణికాగ్రేసరుండవగుట,
భూరిగుణయూథ కాశికాపురసనాథ | విగళితామర్త్యరిపుయోధ విశ్వనాథ!

28