పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

191

పూర్వగ్రంథములన్నింటికిఁ బ్రత్యంతరములు వ్రాసినలేఖకులు దీనిని ముట్టుకొనరైరి. ఇంక నుపేక్షించినయెడల నీపుస్తక మదృశ్యమగునేమో యని శ్రమ చేసి యథాశక్తిని శుద్ధప్రతిని సిద్ధపఱచి ముద్రణమున కొసంగఁగలిగితిమి.

ఈకవి వ్రాసిన రెండుశ్లోకము లొకజీర్ణపత్రముమీఁదనుండఁగ యథారూపముగ వ్రాసితిమి. ఈశ్లోకద్వయమువలన నీకవి సంస్కృతకవితానైపుణ్యము బోధ కాఁగలదు.

శ్లో.

మేమస్సర్వనీరదఘనాఘనతా ప్రసిద్ధి
స్సంపశ్య కేవలఘనం సరదం ప్రసిద్ధం
శ్రీనారయప్రభువరం సరదం ప్రసిద్ధం
సంపశ్య కేవలఘనం ముఖవర్ణభేదీ
మోఘోభవ త్యనుపమోహి సరాజవర్యః.


శ్లో.

విరాజతే తోకవిరాజిరాజతా
విభాకరే సంస్థితి మేతిహంసతా
సరాజహంస స్సమదీపి సర్వదా
సదాఖ్యయా నారయ భూపవర్యః.

ఈకవి కాంధ్రకవితయం దంతనైపుణ్యము లేదు. శాని సుప్రసిద్ధకవివంశజుఁడును పండితోత్తముఁడు