పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ఆంధ్రులు విద్యావాదములలో గడుసరులనియు నెవరిచే జయింపఁబడని కాంచీనగరపండితుల నాంధ్రనియోగి జయించెననియుఁ జెప్పుకొనుచుందు రని కవి వంశీయులు చెప్పుచున్నారు. వ్యాకరణశాస్త్రపారంగతుఁడును పండితోత్తముఁడు నగురామయోగి రచించిన యీశతకప్రశస్తినిగూర్చి ప్రత్యేశముగా మేము చెప్పవలసిన దేమియు లేదు. ఇక్కవి సంస్కృతమునఁ బెక్కుగ్రంథములకు వ్యాఖ్యానములు మతవిషయికఖండనగ్రంథములు రచించెను. కవి తన యుత్తరవయస్సులోఁ దన గ్రంథసముదాయముతో మచిలీపురమునందు నివాస మేర్పఱచికొనెను. ఉప్పెన వచ్చుటచేఁ గవివ్రాసిన గ్రంథములన్నియుఁ జరాస్తియంతయు సముద్రార్పితమైనదనియు నెటులో దైవవశమున రుక్మిణీపతిశతకముమాత్రము బైటపడినదనియుఁ గవివంశీయు లెఱింగించిరి. మాకు లభించినరుక్ష్మిణీపతిశతకమాతృక కొండపల్లి పీచుకాగితములపై అగురుసిరాతో వ్రాయఁబడియుండెను. పుస్తకము ఒకటి రెండుమాఱులు సముద్రస్నానము గావించినటులె యుండెను. కొన్నిచోటుల వర్ణములు పద్యపాదములు చెరిగిపోయెను. కావుననే