పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

హేలావతిదండకము రెండవభోగినీదండకమువలె మన్నది. రచనయుఁ గవితయు ధారయు హృదయంగమముగానున్నది. కృత్యాదియే ప్రబంధమునకు ముందుభాగమో నిరూపింప వీలు కాదయ్యెను. రామచంద్రకవి సత్కారము జరుగనిచోటులఁ దిట్టుకవిత నుపయోగించి బెదిరించి బహూకృతు లందిన గడుసరి. ఈయనను గూర్చి యనేకవిచిత్రకథలు వాడుకలో నున్నవి. కవి తనప్రగల్భము నొకమా ఱిటులఁ జెప్పుకొనియున్నాఁడు.—

క. దిట్టకవి రామచంద్రుఁడు
     దిట్టిన ఱాయైనఁ బగులు దీవించిన యా
    బెట్టైనఁ జిగురుఁ బెట్టును
    గట్టిగఁ దొల్లింటిభీమకవి కాఁబోలున్

ఈకవిచాటుపద్యములు సమకాలికులను గూర్చిన ప్రశంసాపద్యములుగూడ మాకుఁ గొన్ని లభించియున్నవానిని వరుసగాఁ బ్రదురించెదము. రామచంద్రకవి నివాసము కృష్ణామండలము నంది గామ తాలూకాలోని గొట్టుముక్కల. కాశ్యపగోత్రము. కవిశాలము గ్రహించుటకు గ్రంథాధారము లంతగా లభింపలేదు. కవివంశీయులవద్దనుండి వ్రాయించి