పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శంబుక వధ.


        ధర్మమును నొక మూలకు ద్రోయఁజూచు చున్నావు. అయోధ్యాధీశు
        లెవ్వరిట్టి పనుల కొడి గట్టలేదు.

'శ్రీ:-- మీవాక్యములు సత్యమునే ప్రకటించు చున్నవి. మీరు శంబుక
       సంయమిని మతద్రోహిగా ఋజువు చేయగలిగితిరో నిష్కరుణుల
       మై వానిని శిక్షాపాత్రునిఁ జేసెదము. మేమింతదనుకను శంబుక
       సంయమితో బ్రసంగించితిమి కాని వాని వాక్యము లాదరణీయము
       లుగఁ గన్పట్టుటచే మేమే యాయధికార మిచ్చి వచ్చితిమి. నిరప
       రాధుడుగఁ గన్పట్టు శంబుకుని దునుమాడి పాపమునఁ బోవ నొల్లము.
       రాజులు సర్వప్రజాను రంజకులై 'నేల నేల దగువారుగాని కొందఱి
      యుప దేశముల నమ్మి యపరాధ రహితులను బాధపఱుచుటకుఁ దగు
      వారు కారు.

వ:- (కుపితుడై కమండులువు నేలం బెట్టి కొట్టి గురుతిరస్కారమునకు
      గడంగుచున్నావు. బ్రాహ్మణులిట్టి తిరస్కారము సహింప నొల్లరు.
     బ్రాహ్మణులశక్తి - బరీక్షింప వలయునని తోచె గాబోలు. అట్ల
      యిన వినుము. రేగిన కార్చిచ్చువలె సర్వలోకములను దగ్ధపట
      లముఁ జేయఁజూలును.

శ్రీ: దేవా ! యిది మేఱుంగనిది కాదు. పరశురాముని మే మెఱుంగ
     మనుకొంటిరా ! ఎందులకయిన నోర్తుముగాని మేము విశ్వసింపని
     కార్యములఁ జేయనొల్లము. ఇయ్యది క్షత్రధర్మము, ఇదియిట్లుండ
    మేమరణ్యమున గ్రుమ్మరునప్పుడు గుహుఁడు చేసిన సాయ్యమును
    మఱవుమందురా ! శబరి కనుంబఱచిన యవ్యాజభక్తిని స్మరించు
    మందు రా! ఈయలంతుల మాటయేల? హనుమదాదులు చే
    దోడువాదోడు గాకున్న వారధిగట్టఁ గల్గుదుమా? రావణసంహా