పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్దాంకము

65

        లోచనముల బుట్టినప్పుడే మాన్పుటమంచిది.

శ్రీ:- గురువరా ! శంబుక సంయుమికిఁ గలిగినగతి యని యా మీయభి
         ప్రాయము :

వ: అగును (ఆశ్చర్యముతో) నీవు కూడ స్వయమియనుచున్నాఁడవే!

శ్రీ:- ఇంద్రియ సంయమము గావించిన వాడు సంయమి కాడొకో,
        దీని కేమిగాని శంబుక సంయమికి సంభవించిన దుర్గతియేమి ?

వ: రఘురామా ! మమ్మెక్క సక్కెముఁ జేయుచున్నావా? ఇప్పుడు
       శిక్షించితినని చెప్పితివే ?

శ్రీ:- దేశి కేంద్రా ! క్షమింవుడు, మేమట్లు చెప్ప లేదు.

వ:-- ద్రోహుల శిక్షపాత్రులఁ జేయుపట్ల నయోధ్యపట్టణ ధీశులం
       దెవ్వరును జంకువారు కారన్నమాట నీవనినది కాదా ?

శ్రీ: అగును, మేమనిన వాక్యమే.

వ: అట్లయిన శంబుకుని శిక్షింప లేదనుచున్నావే ?

శ్రీ:- శంబుక సంయమిని శిక్షించుటకుఁ బూర్వము ద్రోహియని స్థిర
     పడవలయును గదా!

వ: మన వాదమంతయు “ఘట్టకుటీప్రభాతన్యాయమ”యినది. స్మృతు
     లేమి చెప్పుచున్నవో వినిపింప లేదా ! స్మృతివాక్యములను బాటించు
    టకన్నను రాజధర్మ మేమికలదు ? హిందూ మతమునకు స్మృతులు
    మూలాధారములు. ఆస్మృతి వాక్యముల ననుష్టేయములుగా జే
    యుట 'రాజధర్మము. స్మృతులు ద్విజేతరులకు దపస్స్వాభ్యాయన
    ములను నిషేధించు చున్నవి. వానిని బాటింపక శంబుకుడు మత
   ద్రోహముఁ జేయుచున్నాడు. నీవు వాని నుపేక్ష జేయుచు రాజ

-