పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

67

</poem>

       రముఁ జేయఁగల్గుదుమా ! ఆర్యులమైన మనమనార్యలపాటి కృత
       జ్ఞులమై యుండఁ దగదా? రాజనీతి మాటయటుంచి తోడ్పడిన వారికి
       బ్రతిఫలముఁ జూపుట మానవ సామాన్యమగు నీతికాదా !

వ:-- శ్రీ రామచంద్రా ! నీవాముష్మికముమాటఁ దలపెట్టక దైహికం

      బాలోచింపుము. వీరందఱికీ సమానస్వత్వ మొసంగిన మాపాట్లే
      మగును ? తరతరం బులనుండి బ్రాహ్మణ క్షత్రియ జాతులు 
      రెండును మిధస్సాహాయ్యంబున వర్తించుట యెఱుంగవో!
      లేకున్న మీరాజ్యమును, మాకుల గౌరవంబును జిరకాలము
      నాడే పేరు లేకుండెడివి. కావున నట్టి యుపద్రవమును దప్పిచు
      టకే యింత తఱచి తఱచి చెప్పు చుంటిమి.

శ్రీ:- (చుఱుకు చూపులతో) దేశి కేంద్రా ! బ్రాహ్మణ సాహాయ్యంబు

     వలన నే రాజులు రాజ్యమేలి ననియా మీ యభి(పాయము ?

వ: (అత్రముతో), కాదు, కాదు; క్షత్రియులు కత్తితో దీర్పఁదగిన

    పనిని బ్రాహ్మణులు మాటలతోడనే తీర్చి రాజుల యలజడిని బాపి
    రని నా యభిప్రాయము.

శ్రీ: చిత్తము; మంచిమాటయే.

వ: కావున నీ రెండుజాతులు పశస్పర సౌభాత్రముననే సౌభాగ్యమును,

   గౌరనమును నదియుండఁగఁవు. దీనికి వ్యతి రేకమయినచో నం
   తఃకలహములచే దినదినము సంక్షీణ భానమండఁగలవు. ఇది
   నిస్సంశయము.

శ్రీ:ఒక జాతి సౌభాగ్యమున కయి మఱి యొక జాతిని సర్వకాలసర్వా

   వస్థలయందు బానిస తనము నందుంచి మూర్ఖులను  జేయుట రాజ</poem>