పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii


కలుగ లేదు. కాని యార్యులు (అనఁగా ఋషులు) దండ కారణ్యముఁ బ్రవేశించి యచ్చటచ్చట పల్లెలం గట్టికొనిరి. ఈజాతిద్యయమున కింకను బరిచయము కలుగ లేదు . దేశ దిమ్మ రియైన హనుమంతుని వంటి వాడెవ్వఁడో సాటి పల్లెలను జూచి యుండును. ర్రామాయణము వలన హనుమంతుఁడు నాల్గు నాళ్ళ పట్టపగలుగ ఋషుల సాహచర్య మనుభవించెనని తెలియఁ గలదు. ఈసాహచర్యమే వీని కొంపఁదీసి రామునికి దాసొను దాసునిగఁ జేసినది. కాని యూర్యుల యాచారవ్యవహారము లింకను వానరులతల కెక్కె లేదు. ఇందు చేతనే వానరులకుఁ గల్లు ద్రాగుట మొదలగు నార్యుల సుగుణంబులు పట్ట వడ లేదు. యగ్నయా గాదులు వీరెఱుంగరు, బలులు వీరెఱుంగరు. , మాంసభక్షణంబు వీరెఱుంగరు. . జెత్ర యాత్రలని చెప్పి దేశమును సంక్షోభింపం జేయుట వీరెఱుఁగరు. ఏపుట్ట తేనెయో | ద్రావుచు, "నేమావిపండో కడుపార దినుచుఁ గాలక్షేషముఁ జేయుచుండిరి. భార్యలు తారుమారగు చున్నను బెండ్లిండ్లు గొంత వరకు కట్టుదిట్టములకు లోబడినవి. గృహచ్ఛిద్రములగుఁ జిక్కి వాలి సుగ్రీ వుని యిల్లు వెడలఁదరిమి యాతని భార్య తారను గ్రహించెను. ఇటులే వాలిన ధానత రము తద్భార్యయగు తారను సుగ్రీవుఁడు కైకొనెను. గృహస్త్రామ మత్యవసరమను : నభి ప్రాయ మప్పటికి లేదు. ఆర్వులంబోలి వీరికిఁ బున్నారు నరకము లేదు. ఇందుచేతనే హనుమంతుఁడు బ్రహ్మాచారిగానుండెను.


వాసరులు ఆనగా వికృత నరులు, అనగా సౌందర్య విహీనులు ఇట్టిజాతు లింకను నీలగిరి మొదలగు కొండలమీఁదను, నరణ్యముల యందు నున్నారు. [1]*సవర (శబరు)లయందు ఆరిసి”యను. జాతి యొకటి యున్నది. అరిసీ యనగా ,క్రోతియను సర్థ ము యీజూతినే 'లంబోలంజ్' అని కూడ పిలుచుచుందురు. అనగా దీర్ఘ వాలము కల వారని ఆర్గము. దీర్ఘ కాపీనము పెట్టుకొనుటచే దీర్ఘ వాలము, కలవారని పిలు వంబడు చుండిరి. ఇంతియే కాని తోకలున్న వని తలంపము . రామాయణమున రుమ తారలను వర్ణించు నప్పుడు వాల్మీకి తోకలున్నట్టు చెప్పలేదు. హిమా లయ సొందారణ్యములోఁ గూర్చుండి రామాయణము వ్రాయఁబూనిన వాల్మీకి వానరులు గోతులవలె నుందురని విని, తత్కారణంబున' తోకలు కూడ నుండునని భ్రమ , పడి యచ్చటచ్చట వీలయినప్పు వెల్ల వానరులకుఁ దోకలు తగిలించి నాఁడని తలంతుము జాంబంతుని కూతురగు జాంబవతిని గృషుఁడు పెండ్లాడెను. వ్యాస భట్టారకుడు జాంబవతికిఁ గూడఁ బోక తగిలించక పోచుటయే కాక మానవ స్త్రీని వర్ణించు నటుల


.

  1. * గంజాము, విశాఖపట్టణము జిల్లాలయందు న్నారు.