పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix


వర్ణించెను. పసికూన యగు జాంబవతి యుయ్యెలలో శమంతక మణి కట్టుట మా నవ స్వభావమునే తెల్పుచున్నయది. శీతవాతాతపబాధల మాన్చుకొను వెఱుఁగక యెండకు నెండుచు వానకు తడియుచున్నచో - వికృకరూపములలవడు టస్వాభావికము కాదు. సరులకు వానురులకు వివాహము జరుగుచున్న యప్పుడు వీరికి తోక లెట్లు వచ్చును ? మగకోతులు తోకలుండుటకు, నాడు కోతులకుఁ దోకలు లేకపోవుట యఁ దటస్థించెనందురా ? వాలిడికోతులను చూచితిమి కాని యాడ మగ కోతులకుఁ . దోకలుండవు. కాన వానరులకు వాలములు గలవను పలుకులను మేము విశ్వసింపఁ జాలము. నిజముగ నివానరులు మృగము లేయగు నెడల మనుష్యులకును, వీరికిని వైవాహిక సంబంధ మెట్లుకలుగును ? సంతాన మెట్లు సంభవించును ? సుగ్రీవుఁడ స్న పెనున్న కసితీర్చకొనుటకె యుచితానుచితములు మరచి శ్రీరామునకుఁ జెలిమి కాఁడై హనుమచారుల తోడ్పాటుచే రావణుని జంపించి లంకా రాజ్యము రామునకు గైవసముంజేసెను. "గ్నాతి శ్ఛేదన లేనకిమ్మ"ను నార్యోక్తి నీయెడ మఱువ దగదు. అర్యుఁడగు | శ్రీ రామచంద్రనకు సాయపడుటచే గ్రంథములార్యకవులు వ్రాయుటచే వీరు దేవాంశ సంభూతు లైరి. బ్రహ్మకూడ నరుఁడు గాఁ బుట్టక వానరుఁడుగా నేల పుట్టవలయునో ? దృష్టి దోషము తాకు ననియా ! లేక బుద్ధి జాడ్యమా ?

రాక్షసులు.

బళ్ళారికి మిగుల దిగువనున్న దక్షిణాపధ మంతయు మాంసభక్షలగు “ద్రావి డుల (అనఁగా రాక్షసులు) స్వాధీనమందున్న ది. కిష్కింధాపురము నుండి లంకా దిగ్విజయయాత్రకై శ్రీ రాముండు బయలు దేరినపిదప నెచ్చటను మున్యాశ్రమములులో చనగోచరము కాలేదు. ఇందుచేఁ గిష్కిందకు దిగువనున్న యరణ్యములను ఋషులు (అనఁగా) ఆర్యులు చొరనటు స్ఫుటమగుచున్నది. వానర రాక్షసులకుఁగూడ సంఘ ర్షణమత్యల్పము; సర్వప్రపంచ విజిగీషాపళనశుఁ డైన రావణునకు నేవాలి చేతనో పరా భవమగుటదక్క - పరస్పర వైషమ్యము లేదనియే చెప్పవచ్చును. వీరు సర్వసాధారణ ముగా వీర శైవులు. రామాయణ కథాకాలమునకు పూర్వము వీరార్యులచే సంపూర్ణ పరాజితులగుటం జేసి ముఖాముఖి, ముద్ధమునకుఁ దొడరక కన్మాటు యుద్ధమునకుఁ జొచ్చిరి. పురాణముల యందు బెక్కు చోట్ల వీరు దేవతా స్త్రీలను, రాచకన్నియలను బలాత్కారముగను, మాయ వేషముల తోడను మోసగించియుఁ గొనిపోవుట నెఱుం దుము. ఈగతి పగతురకు మనోవైక్లబ్య మాసాదించుచుండిరి. వీరి వివాహము