పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

వ్యభీచరించుట దోషముగా బరిగణింపఁ బడదు. టిబెటు నందు నతిధికి భార్యను వ్యభిచారమున కయి సమర్పించు నాచారము గొన్ని చోటుల నింకను బవర్తిల్లు చున్నది. ఈ కారణములచే టిబెట్ త్రివిష్టపమగు నేమో' యని భావింప ననుపగుచున్నది. పూర్వోదాహృత పరిస్థితు లన్నియు నాఁడు నాగరికత శైసవాయస్థ యందున్న దని ఋజు వు చేయునని నమ్మెదము. దీనిని దిలకింప నార్యద్రావిడ నాగరికతారత్రమ్య మిసు - మంతయని తోపక మానదు.

రామాయణకథాకాల హిందూ దేశము,

ద్రావిడులు (వానరులు.)

'రామాయణ కథాకాలము నాఁడు.ద్రావిడ దేశము (ఆనఁగా విధ్య పర్వత దక్షిణ దేశము) సాంద్రారణ్యములతోఁ గీచుమగు చున్నది. దావిడులు చెట్టులం, గుట్టలు, బట్టి యుండిరి. మానరక్షణకై వస్త్రధారణముఁ జేయుచుండిరి. నేటి తెలుఁగు దేశము దండ కారణ్యము గానుండెను.. పంచవటి, జన్మస్థానము మొదలగు పల్లెలు దక్క నీయరణ్యము నిర్మానుష్యము కాకపోయినను నిష్పలియని చెప్పవచ్చును కాని కొన్ని కొన్ని భాగములు రాక్షసుల యేల్పడి బడియు చున్నవి. బళ్ళారి ప్రాంతము జనాకీర్ణమై యుండెను. ఇదియే రామాయణము నందు సుప్రసిద్దమగు కిష్కిందాపుర సీమ. రావణాపహృతభార్యుడై శ్రీ రామచంద్రుఁడు వర్ష కాలంబున సీతా వియోగ దుఃఖ ముచేఁగృశించి, కృశించి, కావురము చేసిన మాల్యవంతమిది యేయని తత్సీమ వాసులు చూపించు చుందురు! ద్రావిడ జాత్యంతర్భాగమగు వానర లోకంబునకు నిదియే యునికి పట్టు; ఇంతకు మున్ను సుప్రసిద్ధ వానరులు కాని, వానరనగరంబులు కాని యున్న జాడ పొడగట్టవు. ఇప్పుడిప్పుడే వానరులావిలిక దిశను వీడి నాగరికులగు చున్నారు. ఆనగా నడవులలోను, గొండలమీఁదను, తోపులలోను దలదాచు కొనుట మాని పట్టణంబులు గట్టుకొని యందు వాసముఁ జేయుటకుఁ నారంబించిరి. ఇందుచేతనే యొక్క కిష్కింధా పట్టణము దక్క- వానరులఁ బట్టణములు లేవు. రామాయణ కాలమున వాలి వానర సార్వభౌముఁడై యిచ్చట నతి పూజ్యముగా రాజ్య మేలుచుండెను. పరిసర దుర్గపు దర్గములు, నరణ్యములు, చిన్న చిన్న పల్లెలతో నిండి యుండెను ఇయ్యవి యొక్కొక్క- దండనాధుని యాధిపత్యములో నుండెడివి. జాంబవంత్సుషేణ, నల, నీల, మెంద, వ్వివివాదు లీపల్లెలకు రాజులు, వాలి సార్వభౌముని సరదార్లు ఈ ద్రా విడ యోధుల కెల్లను గిష్కింధా పట్టణము గుండియ. వీరింకను నార్య సంపర్కము