పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi



యొక ఫరుషుఁడు పలువుర స్త్రీలను గైకొనుటకాని దోషము కాదయ్యే. పంజాబు దేశమునందు కొక తెగ హిందువులయందు నన్న దమ్ములందఱు నొక యుమ్మడి భార్యను సంపాదించుకొను నాచారము నేటికిని బ్రబలి నిరాటంకముగా సొఁగచు న్నది. ఎవ్వఁడయిన తెగించి యీయాచారమునకు వ్యతీరేకించి పెండ్లాడినచోఁ దత్సాం ఘీకులు వాని గొంచెము వానినిగా జూచుచుందురఁట.


ఉత్తర కరుభూములనుండి వచ్చిన యార్యులు తమ జన్మస్థానమును దేవలోక మనియు, ద్రివిష్టటపమనియుఁ దమ గ్రఁ థములచేఁ జెప్పించిరి. ఈ ట్రవిష్టపమే నేటి "టిబెట్" అని యిప్పుడు పిలువబడు చున్నదని కొందరి చరిత్రకారుల యాశయము. “టిబెట్” పీఠభూమి, అనగా హిందూ దేశపు మైదానమునకు సుమారు మూఁడు మైళ్ళ యెత్తున నుండును ఇంత యెత్తున నుండుట చేతనే ఆవిష్ణమాకాశమందున్నదని పౌరాణిలు చెప్పిరి.ఈ చరిత్ర కారుల యభిప్రాయము నిజమనుటకుఁ గొన్ని బలవత్కారణము లుగన్పటు చున్నవి. మన హిందూదేశమునకును నీత్రివిష్ణపము నకును నెంత దుర్గమమైనను దారి యొకటి కలదని పురాణములు చదివిన వారి కెల్లరకుఁ దెలియఁగలదు. పురాణము లెట్టి దారులు కల్పించిన నేమి ! స్వర్గలోకమునం పూజ్యారు డును దేజోవంతుఁడును ,బ్రజలు నమ్మఁగల రాజు లేక పోవుటచే స్వర్గలోక వాసులు మన హిందూ దేశమునకు వచ్చి యసామాన ప్రతిభావంతుడైన సహుషినిం గొంపోయి పటాభిషిక్తు నుంజేసిరి.కృష్ణుఁడు సత్య భామాసమేతుడయి, కల్పవృక్షమున కయి సర్గలోక ముపయి దాడి వెడలి యుండెను. అర్జునుడు కూడఁ గారణాంతరములచే స్వర్గలోక మునం జూడఁబోయెను. అనగా జానకి తండ్రి' యింటికీఁబోయెను. అప్పుడర్జనుడు స్వర్గలోకమునఁ జూచిన యాచార వ్యవహారములకును, నేఁటి టిబెటు లోన కొన్ని యాచార్యవహార భేదము రవ్వంతయుఁ గానబడదు. స్వర్గలోకమున స్త్రీ పురుషులకు వావివరుస లక్కఱలేదు. టిబెటు నంతయే.స్వర్గలోకమున స్త్రీ పదిమంది పురుషులనుగొంగున ముడి వైచి టింగు రంగ యని తిరుగవచ్చును. టిబెటు సందునంలయే, ఈయాచరమే టిబెటునుండి యార్యుల మూలమునఁ బంజాబు దేశంబు కాలి చప్పుడు కాకుండఁ బ్రవేశించినది. ద్రౌపదీ దేవి వివాహము దీనిఫలమని మాయాశయము. దీనికి బూర్వముకూడ నిట్టియుద్వాహములున్న వని పురాణముల వలన మనకు తెలియుచున్నది గౌతముని కూతురగు జటిలయను బ్రాహ్మణకన్య యేడ్వురుని - వార్షి యను ఋషి కన్య పది మందిని బెండ్లాడు వరకు దనివిఁ జెంద లేదట. ఇట్టివివా హములింకను బంజాబు దేశ మునంఘన జరుగుచునే యున్నవి. స్వర్గలోకమున నలధితో