పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

శంబుక వధ


.

       ద లచినదంతయు జెప్పుఁడు. ఆవల దోషులెవరో, నిర్దోషులెవరో
       విచారించి నిర్ణయింతుము,

శ :- దేవా ! యాలించు ప్రభువులున్న నాహృదయావేదన మంతయు
      వెలిబుచ్చు కొనెదను. మేము. హిందూ మతమును శ్వీకరించిన
      కారణమున మానవ సానూన్యములయిన హక్కులను మా యెద్ద
     నుంచి బంతతముగా గుంజు కొనుట యెద్దర్మర్మము?: ఎద్దినీతి?
     సృష్టికర్త యెడల భక్తి విశ్యాసములను దెలుప నానందరస మగ్న
     ముక్తాయై ...ప్రొద్దుల నెల్ల చోటులంబాడు పక్షిగణమున కున్న
     యాపాటి స్వాతంతర్యము మాకూడ దగదా? .....చక్షువు లేని
     జీవరాసుకున్న యుధి కారము మాకుండఁగూడదా ? మేమేమియు
    నవినీతి కార్యములకుఁ జొర లేదు. ఈచరాచరమలను, జేతనాచే
    తనములను సృష్టించిన యా " ఏక మే నాద్వితీయున్ బ్రహ్మన్-”ను
    సేవించుటకును, గీర్తించుటకును, బాడుటకును, బూజించుటకును
    స్వాతం త్ర్యమును గోరుచున్నాము. చతుప్పాద జంతువులు కూడ
    బూర్వకర్మ వాసనచేఁ గల్గిన జ్ఞానలాభమునఁ దపస్సమాధిని జెంది
    తరించినట్లు మనము వినుచున్నాము. అట్టి యధికారము మానవ
    జన్మమెత్తిన మాకుండఁ దగదా? పిపీలికాది బ్రహ్మపర్యంతము
    వెలు గొందుచున్న 'యాదివ్య తేజము యొక్క సంకీర్తన పరాయణ
    లుబ్దంబైన యీ బాలుర కట్టి యధికార మేలయుండఁ గూడదు? మీ
    రాష్ట్రమున జన్మించి తల దాచుకొనుట చేతనా ? పూర్వులు గడి
    యించి యిచ్చిన యీ ప్రాజదువులను వీరిని ముట్ట కుండఁ జేసి
    యజ్ఞాన కూపమునఁ బడద్రోసిన, నీ కార్యములకు నెవ్వరుత్తర
    వాదులగుదురు? ప్రజల మాన ప్రాణస్వత్వరక్షణ భారమునకు
    మూలము రాజు కాడా? హిందూ మతస్థులమని మేము పిలుచు