పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్దాంకము

61

 
        యాదేశమునకుఁ గారణము కూడవలయునా ?

శం:- దేవా ! ఋషలు సర్వస్వతంత్రులు కాన గారణమక్కఱలేని
       మాట నిజమే , ఇష్టమున్న యెడలు నిన్నటి స్మృతిని వీరు నేఁడు మా
       ర్చగలరు. మార్చఁగలరనుట యేల? మార్చిరి, మార్పుచున్నారు.
       ఇందుకు దార్కాణము, భిన్న సంస్కృతులు; అండలి పఃస్పర
       విరుద్దముల , అట్టిచోఁ బ్రతిక్షణము మాఱుచున్న యీస్మృతులు
       గాని తత్సస్మృ తికులు గాని మాస్వత్వ మిట్టిది యని నిర్ణయించుట
       కెట్టులు శక్తిముతు లగుదురు ?

శ్రీ:- (విసుగుతో) ఋషలను, స్మృతును ధిక్కరింప మొద
       లిడితిరా ?

శం:- శ్రీరామచంద్ర ప్రభూ ! మీరు ధర్మమూర్తులు, ధర్మాధర్మ
        నిర్ణీతులు కాన నా ప్రార్ధనము శాంతమతో నాలికింపుడు.
       నేను ఋషులను దూలనాడుట లేదు. తూలనాడట వలవ
       మాకు, గించిల్లాభము కూడ లేదు. ఋషుల మనోగతితో పాటు
       క్షణక్షణము మాఱుచుండు ధర్మశాస్త్రమ లెట్టు లొక్క జాతిస్వత్వ
       మును నిర్ణయింపఁ జాలురో తెలిసి కొన గోరు చుంటిని. మీరా
       స్మృతును బాటింపకున్న నవి యేమగును ? ఇదిగాక మేము
       దుర్బలుల మగుట చేతనే కదా మమ్మధోలోకము పాలు సేయుటకే
       సృజింప బడిన గ్రంధములను ధర్మాధికారులు కూడ ధర్మశాస్త్ర
       ములను చున్నారు. దేవా! యివియార్తా లాపములు. ఆలిం
       పుఁడు దుర్చలస్య బలమో రాజా" యనవినమే ! దోషు లమయిన
       శిక్షింపుఁడు, నిర్దోషులమయిన రక్షింపుడు. ఇంతియే కోరు నది.

శ్రీ:- సంయమీంద్రా ! వినుచుంటిమి, వినుచుంటిమి. మీరు చెప్పఁ