పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శంబుక వధ.

                  మిమ్ముఁ చాలించి మయూరబ్ద కార్యమును నెగ్గించును గాక,
                  మగిడి కిష్కింధాపురమునకుఁ బోవుతలంపున శ్రీరామచుద్రుని
                  కడ సెలవంది. కొన్ని సంగతులు మీకు జెస్పి పోవువాఁడనై
                  యిచ్చటకు వచ్చితిని.

శం:- కుమారా! చెప్ప వైతివా సంగతులను, విన ముచ్చటపడు
                 చుంటిని.

అం: _ మహాత్మా! నోరాడకున్నయది. చెడుమాటలు చెప్పవలసిన
                 వాఁడనైతి.

శం:- ఏమినీ వెర్రి ! తెగించిన వానికి సముద్రము మోకాలిబంటి కాదా!
                ప్రాణమున కాశింపని నాకుఁ జెడుమాట లుండునా?

అం:- ఋషి.చంద్రమా! వసిష్ఠుల వారి కుట్రచే నోషధీ సాహాయ్య
                మున నొక బ్రాహ్మణ బాలుని విసజ్ఞుఁ ని జేసి కొలువునకుఁగొంపోయి
                మీ మాశ్రమవ్య త్యాసముచేఁ గల్గిన ఫలమని ఆ రామచుద్రునకు
               నచ్చజెప్పిరి. నచ్చజెప్పి మిమ్ము శిక్షా పాత్రుని జేయుటకు యత్నిం
               చుచుండ నేను జూడఁజాలక మీకడకరుదెంచితిని.

శం:-- (అలక్ష్యభావమును సూచించు నగవుతో, ఱోటిలోఁదలఁ
             దూర్చి రోకంటిపోటునకు వెఱవనగునా? ఈ కార్యవిధాన
             మంతయు నూహింపనది కాదు. కానఁ బిరుతినియవలసిన పనిలేదు.
             పాపము! పసిష్ఠులవారి కెట్టి యవస్థవచ్చినది ?

అం:- దేనా ! ప్రొద్దెక్కు చున్నది. అనుజ్ఞయిత్తురా! (నమస్కరిం
              చును.)

శం; — (లేవదీసి) కుమారా! కృతర్థుడవుకమ్ము, సుఖమున బోయి
            రమ్ము,