పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీ యాంక ము.

47


                 వచ్చి యచ్చో మా సేవలనంగీక రించుచు నజ్ఞానాంధుల దరింప
                 జేమురాదా?

శం:- ఏమి నీ బేలతనము : దక్షిణాపధమునకు వచ్చుటకు నభ్యంతర
                మేమియు లేక పోవుటయే గాక నాకు సుగ్రీవ సార్వభౌముని సంద
                 ర్శన లాభము కూడఁగల్గును. అయినను నిజముగ శ్రీరామచం
                ద్రుడు నా ప్రాణమునకుఁ దెగినయెడల దక్షిణా పధమునకుఁ దరలి
                నంతమార్రమున నేను దప్పించుకొన గల్గుదునా ! ఇది యెట్ల
                 యినను నేనిచ్చట నీ యాశ్రమ స్వీకారముఁ గావించుట యాత్మ
                లాభమునకే యనుకొంటివా ? అట్లు కాదు. నాయీకృత్యము
                వలన ద్రావిడులందఱు మేలు పొందవలయునని యభిలాషము,
                కాకున్నచో నేనీదుర్గమారణ్యమునందో నిష్ఠుర తపోనిష్ఠాగరిష్టం
                డనయి కైవల్యము బొంద జాలనా ! మఱియు హిందూ మతర
                క్షకుఁడను బిరుదంబుఁదాల్చిన శ్రీరామ చంద్రుని సన్నిధానమున నే
                యీస్వత్వము నిరూపించుకొనఁ జాలుటో లేక స్వత్వముతోపాటు
               ప్రాణమును గోల్పోవుటో తటస్థింప వలయును. రామరాజ్యములో
               మనము దొంగతనముగా భగవద్ధ్యానముఁ జేసికొనవలసియుం
               డునో బాహాటముగా, బహిరంగముగాఁ జేసికొననర్హులమో స్థిర
               పఱచి కొనుటకే మేమి సాకేతపుర ప్రాంత సీమలయందు మల్లాడు
              చున్నాము. రాజు బ్రాహ్మణ వాక్యములఁ దిరస్కరించి మత
              రకుక్షణమే చేయునో, యాదరించి హితరక్షణమే చేయునో, చూడ
              వలసియున్నది.

అం: అమంగళము ప్రతిహతమగు గాక, దేవా ! మాయాదర్శము
             సామాన్యులకు దుర్జేయము, మీభావము గభీరము, మీమాన
             సము కారుణరసాప్లుతము. అఖిలవస్త్వంవంతర్యామియగు నీశ్వరుడు