పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీ యాంక ము.

49


               అం:- (కన్నుల నీరునించికొని డగ్గుత్తికతో) ఎన్నఁటికో పునః ర్దర్శనము?
               సంయమీంద్రా ! యీశిష్యుని సేవ సంగీకరింప నిచ్చగల దేని
               గాంధారి మాంధార ప్రొద్దు వేళ గబురంపినను మీపదసన్నిధి
               వ్రాలును.

శం:-- పరోపకారబుద్ధి మహనీయుల లక్షణముకదా ! పునర్దర్శన మైనను
              గాకున్నను బరస్పర సంభాషణము మాత్రము మఱచి పోకుము.

అం:- దేవా! మియాశీ ర్వాదమే నాకు జీవగర్ర పనివిని యెదను.

శం:- (తటానలు లేచి యంగదుని గౌగలించుకొని గద్గదస్వరముతో)
            కుమారా ! పోయిరమ్ము, సుఖమున బోయి రమ్ము (అంగ
            దుఁడు నిష్క్రమించును శంబుకుఁడు చింతామగ్నుడై కూరుచుం
            డ శిష్యుడొక యుత్తరముతో బ్రవేశించి) దేశి కేంద్రా! యిదిగో!
           శ్రీరామచంద్రుఁడు మీకయి యంపిన యుత్తరము. (అందియిచ్చును)
            ఏమి సెలవిత్తురో ! వాకిట సేవకుఁడు వేచియున్నాడు.

శం:- (ఉత్తరమును దీసికొని వీప్పుచు) బ్రహ్మదాసా !మనమను
           కొన్నది యనుకొన్నట్లు జరుగుచున్నది. ఈయుత్తరమును నీవు
           చదువుము. వినియెదను. అక్షరములు బాగుగాఁగన్పట్టుట లేదు .
           (ఉత్తరము శిష్యునకిచ్చును; శిష్యు డంది పుచ్చుకొని చదువును.)

           శ్రీసాకేత పుర సింహాసనస్థిత పట్టభద్రుండును, సూర్యవంశ
           సముద్భూతుండును, హిందూమత సంరక్షకుండును, వర్ణాశ్రమా
           చార పరిపాలన బద్ధకంకణుఁడు నునగు దాశరథ శ్రీరామసార్వభౌ
           ముండు శంబుకునకుఁ దెలియఁజేయునది;

           నీవు వైదికధర్మ విరుద్ధకర్మతుండవై , స్మృతి విహితమయిన
           ద్విజ సేవ ద్యజించి, ద్వైజ కర్మంబులనుష్కింపు చుండుటయే కాక