పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

శంబుక వధ


         సామాన్యస్వత్వమైన స్వాతంత్ర్యమునకుఁ బ్రతిబంధకము గల్పింప
        నొడిగట్టుకొన్న వారిని దమ దేశమనుండి వెడలనడచుటకయి య
         త్నించుట పాపమో, దోషమో, రాజనీతి విరుద్దమో యోజిం
         పుము. (అంగదుఁడు దిగ్బ్రాంతితో వినుచుం:డును, శంబుకుడా
         వేశమతో నంగదుని మోమునందుఁ జూడ్కి నిలి) మీతండ్రి
         ఋషులకుఁగాని, సాధువులకు గాని 'యేమిద్రోహము, ఏమియప
         కారముఁ జేసినాఁడని రాముఁడు పొదమాటున డాఁగి ప్రాణముఁ
         దీసెను ? (అంగదుఁడు నిరుత్సాహముతో నూరకుండును) పల్క
        వేమియంగదా?

అం:- ( మెల్లగా) ఆడిన బాస నెఱు నేర్చుకొనుటకు.

శం:- (ఉ ద్వేగమ తో) అంగదా ! స్ఫటముగఁ బల్కవేమి ? ఆడిన
      బాన నెఱవేర్చికొనుటకా? అంతనీతిశాలియా ! రావణుడులక్ష్మ
      ణుని మహాశక్తి తో మూర్చాలన నిఁ జేసినప్పుడు రాముడు మీ
      ముందట మీపినతండ్రి తోడను, విభీషణుని తోడను జెప్పినవా
      క్యము లేవి? ఆడిన బాస నెర్వేర్తుసనియా? అసమర్దుడు బ్రతిన నెఱ
      వేర్పలేననియా? చెప్పవేమి ?* జ్ఞాపకము లేదా ? * [1](అంగదుఁడు
      నిరుత్తరుఁడై యుండును, శంబుకుఁడు సమ ద్వేగమువలన జనించిన
      కంపితస్వరముతో, జుఱుకుచూపు లంజూచుచు) కుమారా ! ఇది
      యిటులుంచుము, పరోపకారార్థము బ్రతిన పట్టుట మేలు గాని యా
     త్మలాభమునకై ప్రతిన పట్టి తినని నీచకార్యమునకు నొడిగట్టుట
     ధర్మమా ! ప్రతిజ్ఞా పూర్వకములయిన నీచ కార్యములన్నియు


  • భానుజ సేనగోంచుఁ గి ష్కిం ధకు నేగు నాపలుకు సెల్లదు నీపునుబోవిభీవణా!
          భాస్కరరామాయణము.