పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము.

43

అం:- దీనికి నేనేమియుఁ జెప్పజాలనుగానీ, పరస్త్రీని దొంగిలికొని
         పోవుట పాపకార్యము కాదా ! అనంతరమెంత నీతితో వర్తించిన
         నేమి ! దుష్పధము కాగుండునా ?

శం:- దీనికి గల కారణములను గూడ నాలోచించి యవల నీకుఁ దోఁచిన
        తీర్పుఁ జెప్పుము. రామడు నిష్కారణముగా ననార్యలనందఱిని
        దెగటార్చుటకు ఋషులతో బంతమ పల్కెను. ఇది న్యాయమో !

అం:- నిష్కారణ మేమి మహాత్మా ! ఆ ఋషులకు నీద్రోహు లెన్నెన్ని
        యో యపచారములుచేసి యాపదలుగ జేసెను.

శం:- వీరు చేసినయవి నీతి కార్యములుదల పెట్టావా ? వీరు నిజముగ బ్రహ్మ
       జిజ్ఞాసువులనియా నీయభిప్రాయము ?

అం:-అగును బ్రహ్మజ్ఞాసు లనియే నాయభిప్రాయము :

శం:-నాయనా! వినుము. నీయ భిప్రాయము సరియైనది కాదు. ఆర్య
     చక్రవర్తులచే ననార్యరాజుల గుట్ట మట్టు కనుగొనుటకు దక్షిణ
     పధంబునకుఁ బంపఁబడిన యోగి వేషధారులయిన ఛద్మవిద్యాదిపా
     రంగతులు. తమనీచ కార్యములకు మతమును గ్రప్పడముగాఁ జేసి
     కొనిన మృషాసంయములు. వీరు దక్షిణాపథమస నచ్చటచ్చటఁ
     బల్లెలు గట్టుకొని శిష్యపరంపరల మూలమున వార్తా సంగ్రహణముఁ
     జేయు చారులు. వింధ్యోత్తర భూముల నుండి వెడలఁ దఱిమి, దక్షి
     ణాపధమున గీచుమను కాఱడవులో, జెట్టు గుట్టలఁ బుట్టలంబట్టిం
     చియు నచ్చటకైన నిలువనీడ లేకుండఁ జేయుట కేర్పడిన కొఱ
     ముట్ట్లు. ఇయ్యది సత్యమని వీరి పూర్వ చరిత్రంబుల యందుఁ 'బెక్కు
    చోట్ల దార్కాణముఁ జూపనగును. దీని కంతయు మూల కందము
    జుత్రి వైషమ్యము. సామ్రాజ్యము లు దగ్ధపటలముల జేసి మానవుని