పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీ యాంక ము.

45


 
          నిర్దోషములను, నిష్కళంకమలును నిర్మలినములను నగనా ?

అం: దేవా ! నేను గర్త వ్యతామూఢుడనై తి, ముగ్ధుడనైతి, మీ
           వాక్యములఁ బూర్వపక్షమ సేయ జాలను, జేయ నొల్లను. (పకం
           పితస్వరమ తో) నాఁడా రాయబారిగా లంకాపట్టణమం బ్రవేశించి
           యాప్తవగ్గముతో నిండుకొలవై యన్న రావణుని తేజ ఓజములు
           నాకన్నుల మిఱుమిట్ట గొలుప నాసభా గణమున నఱజాము
           నిస్పృహుడవై ,నిలువంబడితిని. తుట్ట తుదకు నడచుచున్నది ధర్మ
          మార్గమని చెప్పి నిందావాక్యము లాడితిని. మాహనుమన్న మాత్ర
          మో రావణ్యుడు మూడులోకములను బరి పాలించుటకుఁదగినవాఁ
          డని నాతోడ రహస్యమగా నొకనాడు చెప్పెను.

శం:- కుమారా ! యింకొక మాటవినుము. రావణుఁడు నీచుఁడే నీచ
        తరుఁడే నీచత్వముడేకాని యట్టినీచుని సబంధకమనగాఁ జంపిన
        యనంతరము శ్రీరామచఁద్రుసకు వాటిల్లినయాపత్తేమి ?

అం:- (విచారిం చి) నేనెఱిగినంతవట్ట నకు నాపత్తేమియు లేదు.

శం:- లేదా ? ఆటులయినచో రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠకు గార
         ణ మేమి ?

అం:- జ్ఞాపకము నకువచ్చినది. రావణ వధచే శ్రీరామనకు బ్రహ్మహ
        త్యమహాపాతకమ చట్టకొన్నదియట.

శం:- (ఎక్క సక్కెమను దెల్పు చిఱునగవుతో) నీచునిజంఫుటచే
       బ్రహ్మహత్య యెట్లు సంభవించును ? బ్రహ్మజ్ఞానియైనప్పుడుకదా
       తద్వదచే బ్రహ్మహత్య తటస్థించును. నీచకార్యములు చేయ వాడు
       బ్రహ్మ జ్ఞాని యెట్లగును ? విచారింపుము.

అం: స్వామి ! క్రమక్రమముగ సర్వమును నామనో నేత్రములకు
       విశదపడుచున్నది.