పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శంబుక వధ


        నింతకు మున్న నార్యులు కూడి బ్రహ్మత్వము గడియించి నట్లు విన్నా
       రము. శంబుకుని వాక్యముల యందు మతద్రోహబుద్ధి యున్నట్లు
       కన్పట్టదు.

వ:- రామచంద్రా ! పొర బడు చున్నాడవు. నీవు చెప్పునది కృతయుగ
      మునాటి కథలు.

శ్రీ:- అయ్యా ! యుగభేదముచే స్వత్వము కూడ మాఱునా ?

వ:- దానికింకను సందియ మేల ?

శ్రీ:- అట్లయిన నీవిషయమున దీర్ఘ విచారణము " జేయ వలయును.
      అనాలోచితముగా గార్యములను జేయఁజూలము. క్షమింపుఁడు

హ:- (తనలో) శ్రీ రామభద్రుఁడు సత్యము: నేపల్కు చున్నాడు.

శ్రీ:- (ఆలకించి,) ఎక్కడ నుండి యో రోదన ధ్వానములు వినవచ్చు
      చున్నవి.

ద్వా.పా:- (ప్రవేశించి) బ్రాహ్మణు-కొక్కఁ డాక్రందనము జేయుచు
               మొగసాలకడ నిలువంబడియున్నాఁడు. ఏమి సెలవు ?

శ్రీ:- వెంటనే లోనికిఁ గొనిరమ్ము,

ద్వా: చిత్తము (నిష్క్రమించును) (బ్రాహ్మణుడొక్కడొక్క బాల
        శవంబుతో బ్రవేశించి యాత్రముతో రామునుద్దేశించి)

బ్రా: చం||ఇనకులవర్యు డొరఘున, కేంద్రునిదొట్టియు నేటి దాకనున్
       జనకులుగల్గ బుత్రకులు • చచ్చుటగానము నీతలాటమం
       దున ఘటియిల్లె గారణము • తోఁచదు శూద్రుఁడెవండో యెచ్చటో
      తనమత ధర్మముల్ విడచి , తప్పుపధంబునఁ బోవఁబోలెడిన్

      ఉ|| ఓరఘు రామ!కట్టెదుట • నున్నది బాలశవంబుఁ జూడు మీ
      పాఱుల బ్రోవలేని, నర • పాలకు 'లేటికి ! మీదుపూర్వులె