పుట:2015.389095.Shabhuka-Vadha.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయా o క ము.

33


 
      బట్టి యే మరణ దండన విధించ వలయును. ఇయ్యది కఠిన శిక్షయని
      తలంప రాదు. ఇరు పక్షముల వారి మేలుకొఱకే. అవయవముల
      యందొక్కటి దుష్టమయిన దానిని ఖండించి వైచుట వైద్యునకు
      విధి. ఇందు వేఱొండు తెఱువు లేదు.

శ్రీ:-(నివ్వెరగంది, కొంచెము విచారించి), మీరీమాటలు చెప్పదగదు
      మేము విన నుదగదు. వేయేల ! వినఁ జాలము. దుష్టశిక్షణంబున నా
     ఱి తేఱిన యీహస్తము నిరవపరాధునిఁ ద్రుంపజాలదు.

వ:--నిరపరాధుఁడను చున్నాఁడవు. స్మృతి ధిక్కారముఁ జేసి మత ద్రో
      హము గావించిన నీచుఁ బెట్టి దండనకయిన నర్హుడే,

      (హనుమంతుడు ప్రవేశించి యదృశ్యుడై యంగదుడు కూరుచున్న
      స్థలమునకు కరుచుండబోవును.)

అం:-(తొలగి తనలో) పాపము మాహనుమన్నకుగండ్లు కనఁబడుట
         లేదు. ఇది బ్రాహ్మణ భక్తికిఁ బ్రతి ఫలముగా బోలును.

శ్రీ:- అటులయినచో మేము శంబుకుని సన్నిధానమున కరిగి యాత
       డొనర్చు చున్నది మత ద్రోహమని నచ్చజెప్పి మంచి మార్గమున
       బెట్టెదము.

వ:- మేమిదివఱకే యతనితో ముచ్చటించి యుంటిమి. అతఁడు మా
      మాటలను బెడ చెవులను బెబ్బుటయే కాక యనార్యులకుఁ గూడ మత
      మునందు సమానమగు స్వత్వమున్నదని తర్కించి, ప్రాణము
      నయిన వీడుదును గాని యంత రాత్మకువ్యతి రేకముగా నారబ్ధ కార్య
      ములను విసర్జింపనని మొండిపట్టు పట్టి ఖండితముగాఁ జెప్పినాడు.
      అందు చేత నే మీ సన్నిధానమునకు వచ్చితిమి.

శ్రీ:- ధర్మసూత్రములు మాబోంట్లకు దురవగాహము. . అయినను